అలాంటి సినిమాలు చేయాలంటే భయం : మహేష్ బాబు

Super star mahesh babu talking about his upcoming movie 'Maharshi'

 

తన కెరీర్‌‌ మొత్తంలో ఇంత డెప్త్ ఉన్న స్టోరీ ఎప్పుడూ వినలేదు అంటున్నాడు మహేష్ బాబు. వంశీ  పైడిపల్లి దర్శకత్వంలో నటించిన ‘మహర్షి’ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడాయన. ఈ నెల 9న విడుదల కానున్న ఈ చిత్రం గురించి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మహేష్ చెప్పిన విశేషాలు…

 • ఇందులో మూడు గెటప్స్ ఉంటాయి. స్టూడెంట్, సీఈవో, గ్రామంలో మరోటి. కానీ నాకు నచ్చింది, చాలెంజింగ్ అనిపించింది మాత్రం కాలేజ్ గెటప్. పాతిక సినిమాల తర్వాత కాలేజీ కుర్రాడిగా నన్ను నేను ఊహించుకోడానికే కొంత టైమ్ పట్టింది. పైగా దాదాపు 45 నిమిషాల సీన్స్.  అవి కన్వీన్సింగ్ గా చూపిస్తే మనం ఆచీవ్ చేసినట్టే అని కథ విన్నప్పుడే వంశీకి చెప్పాను.

 

 • నా కెరీర్ మొత్తంలో క్యారెక్టర్ పరంగా ఇంత డెప్త్ ఉన్న స్టోరీ ఎప్పుడూ వినలేదు. కంటెంట్ కూడా రిచ్. ఇంత జెన్యూన్ మూవీ ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు కూడా చూసి ఉండరు.అన్ని ఎమోషన్స్ ఉంటూ, అన్ని యాంగిల్స్ కవర్ చేస్తూ, అందరికీ నచ్చేలా ఉంటుంది.

 

 • నా ఇటీవలి చిత్రాల్లో బలమైన సందేశాలు ఉన్నాయి. అది పూర్తిగా దర్శకుల గొప్పతనం. ఆ చిత్రాల్లో నటించడం నేను గర్వంగా  ఫీలవుతున్నాను. ‘శ్రీమంతుడు’లో గ్రామాల దత్తత, ‘భరత్ అనే నేను’లో అకౌంటబిలిటీ ఎలాగో ఇందులోనూ ఓ పవర్ ఫుల్ పాయింట్ ఉంటుంది.

 

 • ‘మహర్షి’ సబ్జెక్ట్ అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది. ప్రేక్షకులంతా ఇది మన జీవితంలోనూ జరిగిందే అని ఫీలవుతారు. సినిమాపై  వంశీ ఫుల్ క్లారిటీగా ఉన్నాడు.కథ ఎలా చెప్పాడో అలాగే తీశాడు. ఈ సినిమాతో ఎక్కువ పేరొచ్చేది వంశీకే. అంత అద్భుతంగా తీశాడు.

 

 • మే 9 అనేదే మ్యాజికల్ డేట్. ఎన్నో సూపర్ హిట్స్ ఆ రోజు రిలీజయ్యాయి.నా ఫ్యాన్స్ కూడా ఇప్పటి నుంచి మే నెలలోనే సినిమాలు రిలీజ్ చేయమంటారు.

 

 • టీజర్ సమయంలో ‘శ్రీమంతుడు’తో  పోలికలున్నాయనుకున్నారేమో  కానీ ట్రైలర్ వచ్చాక ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. అందరూ అనుకున్నట్టు త్రీ ఇడియట్స్​కి, పాశర్లపూడి బ్లో అవుట్ కి కూడా ఎలాంటి సంబంధం లేదు.

 

 • సినిమా అనేది టఫ్ టాస్క్ అయిపోయింది. ఓ పెద్ద  సినిమా చేయాలంటే  మినిమం ఎనిమిది నుంచి పది నెలలు పడుతోంది. నా గత చిత్రానికి, దీనికి ఒక నెల మాత్రమే గ్యాప్ తీసుకున్నాను. అప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నాను. నాన్నగారు మూడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు. మా  విషయంలో ఇరవై ఐదవ సినిమాకే ల్యాండ్ మార్క్ సినిమా అని సెలెబ్రేట్ చేసుకుంటున్నాం.

 

 • అనిల్ రావిపూడితో  సినిమా నా చాయిసే. జూన్ చివరివారంలో  ప్రారంభమవుతుంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్. ఎలాంటి సందేశాలూ ఉండవు. నిజానికి సుకుమార్ గారితో అనుకున్నాం కానీ.. వరుసగా సోషల్ మెసేజ్ సినిమాలు, ఇంటెన్స్ ప్రాజెక్టులు అవుతాయని అనిల్ గారి సినిమా ఓకే చేశాం. ‘దూకుడు’లాంటి ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ చేయాలనిపించింది. నాకూ కొంచెం ఫ్రెష్ గా ఉంటుం ది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావొచ్చు. అదే సుకుమార్​కి చెప్తే ఆయన కూడా మరొకరితో సినిమా చేసి వస్తానన్నారు.

 

 • స్క్రిప్ట్ లేకుండా షూటింగ్​కి దిగి, ఒక షెడ్యూ ల్ ఆపి, దాన్ని బెటర్ చేసుకుంటాం అనే రోజులు పోయాయి. ప్రారంభించామంటే స్క్రిప్ట్​పై డిస్కషన్స్ ఉండకూడదు.అందుకే  బౌండెడ్  స్క్రిప్ట్​తో నే సినిమా చేయాలి. నా ఫెయిల్యూర్స్ అన్నిటినుంచి నేర్చుకున్నది ఇదే.  స్పైడర్, బ్రహ్మోత్సవం సినిమాల విషయంలో నేరేషన్ విన్నప్పుడు ఎక్సైటింగ్​గా అనిపించింది. షూటింగ్​కి వెళ్లాక తెలిసి పోయింది. ఇలాంటివి రిపీట్ కాకూడదనుకున్నాను. పూర్తి స్క్రిప్ట్ విని నచ్చితేనే నటిస్తాను.

 

 • చాలామంది కొత్త దర్శకులు వస్తున్నారు. వాళ్లెవరూ నాకు పూర్తిస్థాయి కథలు చెప్పలేదు. ఎక్సయిటయ్యే సబ్జెక్ట్ అయితే చేస్తాను. అంతే తప్ప వారినెవరినీ నేను ఎంకరేజ్ చేయకపోవడం కాదు.

 

 • రాజమౌళి గారితో ఓ సినిమా ఉంది. మాఇద్దరి కమిట్మెంట్స్ పూర్తవగానే అది మొదలవుతుంది. త్రివిక్రమ్ కూడా ఓ స్టోరీ డిస్కస్చేశారు. నాకు నచ్చింది.

 

 • ‘మేజర్’ సినిమా కాన్సెప్ట్ నచ్చడంతో సోనీ పిక్చర్స్​తో కలసి నిర్మాతగా వ్యవహరిస్తున్నాను.‘గూఢచారి’ చూశాను. అలాంటి దర్శకుల టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి. ఇది కొనసాగుతుం ది. నేను చేయలేని కొన్నిసినిమాల్ని ఇలా నిర్మిస్తాను. కథలు,దర్శకులు  ఓకే అయితే పెద్ద హీరోలతోనూ తీయడానికి సిద్ధం.

 

 • హిస్టారికల్ సినిమాలంటే నాకు భయం. రాజమౌళి గారిలాంటి దర్శకుడైతే ఆలోచిస్తాను. అంతేకాని మరొకరితో అంటే కష్టమే. అలాగే మల్టీస్టా రర్ చేయడం కూడా జోక్ కాదు. ఇద్దరు పెద్ద స్టార్స్​తో చేయడం రాజమౌళి లాంటి దర్శకులకే సాధ్యం. మల్టీస్టారర్ ఏదైనా కథ, దర్శకుడి టాలెంట్ ని బట్టి ఉంటుంది.

 

 • మహేష్ యాక్ట్ చేయగలడని నిరూపిం చింది‘మురారి’.  నన్ను స్టార్​ని చేసిం ది ‘ఒక్కడు’.  నాకు యూఎస్ మార్కెట్ ఓపెన్ చేసింది ‘అతడు’.‘పోకిరి’తో నన్ను సూపర్ స్టార్ అన్నారు. ఇవన్నీ నా కెరీర్​లో ఇంపార్టెం ట్ సినిమాలు.  అంతేకానీ సక్సెస్ ని , ఫెయిల్యూర్స్​ని దృష్టిలో ఉంచుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుల పేర్లు చెప్పలేదు. యూరప్ నుంచి 16 గంటల ప్రయాణం చేసి వచ్చాను. స్టేజ్ పైకి వచ్చాక కొందరు ఫ్యాన్స్ హడావుడి చేశారు. ఆ క్రమంలో కొందరి పేర్లు మర్చిపోయాను. పూరికి థ్యాంక్స్ చెప్పకపోవడం తప్పే.

 

 • ‘వంశీ రెండేళ్లు ఎదురు చూశాడు. ఈ రోజుల్లో రెండు నెలలు కూడా వెయిట్ చేయరు’ అన్నవి వంశీని పొగుడుతూ అన్న మాటలు. అంతే తప్ప సుకుమార్ గారిని ఉద్దేశించి కాదు. ఆయన చాలా స్పెషల్ డైరెక్టర్ . ‘వన్’ నా కెరీర్​లో ఒక కల్ట్ సినిమా. నా కొడుకుతో కలసి నటించిన సినిమా అది. సుకుమార్ నా ఫేవరేట్ డైరెక్టర్ . భవిష్యత్తులో మళ్లీ ఆయనతో కలసి వర్క్ చేస్తాను.

 

 • సింగిల్ లాంగ్వేజ్ లో సోలో హీరోకి రూ.150 కోట్ల మార్కెట్ అంటే గర్వం గా ఉంటుంది. అంతకు మించి వసూళ్లు రాబట్టాలనే టెన్షన్ కూడా ఉంటుంది. 120 కోట్లకు అమ్మినప్పుడు 150 కోట్లు వసూలు చేస్తేనే బ్లాక్ బస్టర్ అంటారు. అప్పుడే బయ్యర్స్ కూడా హ్యాపీగా ఉంటారు. అందుకే  సినిమా కచ్చి తంగా సక్సెస్ అవ్వాలనే టెన్షన్ ఉంటుంది.

Latest Updates