సూపర్ మ్యాన్ పుట్టాడు

సూపర్ మ్యాన్ .. చిన్నపిల్లలకు భలే ఇష్టం. ఇంట్లో అప్పుడప్పుడు చేతిని పైకి చాచి గాల్లోకి ఎగిరిపోతున్నట్టు వాళ్లు పెట్టే పోజు నవ్వులు తెప్పించకమానదు. ఈ చిన్నోడు పుట్టడం పుట్టడంతోనే ఇదిగో ఇలా సూపర్ మ్యాన్ లా పోజు పెట్టేశాడు. ఆ చిన్నారి నాన్నే ఈ ఫొటో తీశాడు. ఆ చిన్నారి పేరు హారీ. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ వాళ్ల ఊరు. అయితే, ఈ ఫొటో ఇప్పటిది కాదులెండి. ఏడేళ్ల క్రితం తీసింది. ఇప్పుడా చిన్నారి పెరిగి పెద్దయ్యాడు. ఇటీవల తన ఫ్రెండ్ అడగడంతో ఆ ఫొటో ఇచ్చానని హారీ తల్లి బ్రీ చెప్పింది. అలా ఇప్పుడా లిటిల్ సూపర్ మ్యాన్ ఫొటో బయటకు వచ్చిందన్నమాట.

Latest Updates