కరోనా తో ఆన్ లైన్లో సూపర్ మార్కెట్లు

కస్టమర్ ఇంటికే డెలివరీ

స్టాప్ ను సిద్ధం చేస్తోన్న రిటైలర్స్

కరోనా దెబ్బకు కంపెనీలన్ని ఆన్‌లైన్‌లోకి మారుతున్నాయి. చిన్నచిన్న స్టోర్లనుంచి పెద్దపెద్ద రిటైల్, రెస్టారెంట్ కంపెనీల వరకు ఆన్‌లైన్‌ వైపుకే సై అంటున్నాయి. దీని కోసం స్టాఫ్‌‌ను కూడా సిద్ధం చేస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకపోతుండటంతో ఆన్‌లైన్ అమ్మకాలు, హోమ్ డెలివరీలు విపరీతంగా పెరుగుతున్నట్టు లీడింగ్ రిటైలర్స్, ఈ కామర్స్ కంపెనీలు, రెస్టారెంట్లు చెబుతున్నాయి. దీని కోసం డెలివరీ పర్సనల్‌‌ను నియమించుకుంటున్నట్టు , ప్రస్తుతం స్టోర్లలో పనిచేస్తున్న స్టాఫ్ కు శిక్షణ ఇస్తున్నట్టు కంపెనీలు చెప్పాయి. అంతేకాక మరిన్ని వేర్‌‌‌‌హౌస్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపాయి. వాల్‌‌మార్ట్ కు ‌ చెందిన ఫ్లిప్‌కార్ 4 వేల మంది ని నియమించుకునే పనిలో పడింది. అదేవిధంగా స్పెన్సర్స్ రిటైల్ కూడా వెయ్యి మందిని నియమించుకుంటున్నట్టు ఇద్దరు సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ లు చెప్పారు. రిలయన్స్ రిటైల్, అరవిండ్ ఫ్యాషన్స్‌‌ లు ఈ కామర్స్, ఫోన్ ద్వారా ఆర్డర్లు స్వీకరిస్తున్నాయి. దీని కోసం వారి స్టాఫ్‌‌ను కూడా సిద్ధం చేస్తున్నాయి.

 లాక్‌ ‌డౌన్ తో సేల్స్ పెరగాలే!

లాక్‌డౌన్ తర్వాత ఎలాగైనా స్మార్ ఫోట్‌‌ న్లు సేల్స్ పెరిగేలా చూడాలని ఇప్పటికే ఆల్‌‌ ఇండియా రి టైలర్స్ అసోసియేషన్ సెల్‌‌ ఫోన్ స్టోర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు దాని ప్రెసిడెంట్ అరవింద్ ఖురానా చెప్పారు. విజయ్ సేల్స్, కోహినూర్, గ్రేట్ ఈస్ట్రన్ రిటైల్ వంటి కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్స్ ఇప్పటికే ఈ కామర్స్ పోర్టల్స్ ను క్రియేట్ చేయడం ప్రారంభించాయి. అంతేకాక వీడియోకాల్ ద్వారా ప్రస్తుత స్టాఫ్‌కు ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఫోన్ బుకింగ్స్ ను చేపడుతున్నాయి. కాంటాక్ట్ లెస్ సేఫ్ డెలివరీ చేపట్టేలా స్టోర్ స్టాఫ్‌కు ట్రైనింగ్ ఇస్తున్నామని, డెలివరీ కోసం ఫ్రంట్ ఎండ్ స్టాఫ్‌‌ను పెంచుకుంటున్నామని స్పెన్సర్స్ రిటైల్ అండ్ నేచర్ బాస్కెట్ ఎండీ దేవేంద్ర చావ్లా చెప్పారు. ఉబర్, స్విగ్, జొమాటో, గీ ర్యాపిడో జిప్‌ వంటి డెలివరీ ఫ్లీట్ ఆపరేటర్లతో రిటైలర్లు భాగస్వామ్యంకుదుర్చుకుంటున్నారు. దీంతో తమ ప్రొడక్ట్‌‌ లాక్ డౌన్ తర్వాత మరింత మందికి చేరుకునేలా ప్లాన్ చేస్తున్నాయి. టేక్‌ అవేస్, హోమ్ డెలివరీల కోసం సెపరేట్ బిజినెస్ వెర్టికల్స్ ‌ను స్పెషాలిటీ రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తున్నాయి.

ఇప్పటికే గ్రోఫర్స్, బిగ్‌బాస్కెట్ సిద్ధం..

గ్రోఫర్స్, బిగ్‌బాస్కెట్ లాంటి సంస్థలు ఇప్పటికే మాన్‌‌పవర్‌‌‌‌ను పెంచుకుంటామని ప్రకటించాయి. లాక్‌ ‌డౌన్ కారణంతో డిమాండ్ బాగా పెరిగిందని, ఆ డిమాండ్‌‌ మేరకు మాన్‌ ‌పవర్లేదని చెప్పాయి. ప్రస్తుతం ఎనిమిది నుంచి పదింతల మేర డిమాండ్ పెరిగినట్టు వెల్లడించాయి. 12 వేల మందిని నియమించుకునేలా ప్లాన్ చేస్తున్నట్టు గ్రోఫర్స్, బిగ్‌బాస్కెట్ తెలిపాయి.లాజిస్టిక్స్ పార్టనర్ల ద్వారా డెలివరీకోసం వెను వెంటనే ప్యాకేజింగ్ చేసేలా ఆఫ్‌‌లైన్ స్టోర్లు తమ స్టాఫ్‌‌ను వాడుకుంటున్నాయి.

Latest Updates