రజినీ, పవన్, వెంకటేశ్ లకు సూపర్ స్టార్ ఛాలెంజ్

సూపర్ స్టార్ కృష్ణ తమిళ తలైవ రజినీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేశ్ లకు ఛాలెంజ్ విసిరిరారు. ఛాలెంజ్ అంటే సినిమాల గురించి కాదు గ్రీన్ఇండియా ఛాలెంజ్. అవును.. ఇటీవల టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని  పలువురికి  ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ స్వీకరించిన వారు మూడు మొక్కలు నాటి సంరక్షించాలి.   లేటెస్ట్ గా ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ తన ఇంటి ప్రాంగణంలో ఎంపీ సంతోష్ కుమార్, కాదంబరీ కిషోర్ తో  కలిసి మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణ  రజినీకాంత్,పవన్ కళ్యాణ్,వెంకటేశ్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

 

Latest Updates