ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇచ్చే పార్టీకి మద్దతు: కేజ్రీవాల్‌ 

ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలకు తప్ప కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏ ఇతర పార్టీకైనా మద్దతు ఇస్తామన్నారు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌. అయితే అది కూడా ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇచ్చే పార్టీకి మాత్రమే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఏ పార్టీకి మద్దతు ఇస్తామనేది ఫలితాల తర్వాతనే తమ నిర్ణయాన్ని తెలుపుతామన్నారు కేజ్రీవాల్.

తూర్పు ఢిల్లీ ఆప్‌ అభ్యర్థి ఆతిషిపై బీజేపీ నేతలు చేస్తున్న దుష్ర్పచారాన్ని కేజ్రీవాల్‌ తప్పుబట్టారు. ఉన్నత విద్యానభ్యసించిన ఓ మహిళ పట్ల బీజేపీ అలా ప్రవర్తించడం సరైంది కాదన్నారు.

ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 12న పోలింగ్‌ జరుగనుంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌-ఆప్‌ కలిసి పోటీచేయాలని చివరివరకూ ప్రయత్నాలు చేశాయి. నేతల మధ్య చర్చలు ఫలించకపోవడంతో  రెండు పార్టీలు విడివిడిగానే ఎన్నికల బరిలో నిలిచాయి.

Latest Updates