‘మహా’ రాజకీయంపై సుప్రీం కీలక నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. ప్రస్తుత గొడవ సుప్రీంకోర్టుకు చేరింది. ‘మహా’ రాజకీయంపై సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. ఫడ్నవిస్‌కు మద్ధతిచ్చే ఎమ్మెల్యేల లేఖలను రేపు సమర్పించాలని ఏజీని ఆదేశించింది. శివసేన నుంచి ఉద్ధవ్ థాక్రే సీఎం అవుతారని శరద్ పవార్ ప్రకటించిన 12 గంటల్లోనే ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, శివసేన, ఎన్‌సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాయి. కానీ, దానికి భిన్నంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ కూటమి పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీజేపీ తరపున ముఖుల్ రోహత్గీ.. కూటమి తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న సుప్రీం అనూహ్యంగా ఓ నిర్ణయం తీసుకుంది. ఫడ్నవిస్‌కు మద్ధతిచ్చే ఎమ్మెల్యేల లేఖలను రేపు సమర్పించాలని గవర్నర్‌ని ఆదేశించింది. ఫడ్నవిస్‌కు మద్ధతుంటే రేపే బలపరీక్ష నిర్వహించాలని కూటమి తరపు లాయర్ సుప్రీంను కోరారు. దానికి స్పందించిన సుప్రీం.. వెంటనే బలపరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని కపిల్ సిబల్ వాదనను తోసిపుచ్చింది. మద్ధతు లేఖలు సమర్పించిన తర్వాత బలపరీక్ష గురించి ఆలోచిస్తామని సుప్రీం తెలిపింది. మహారాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం భావించింది. కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటిసులు జారీ చేసింది. తదువరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Latest Updates