‘ప్రైవేటు’లో క‌రోనా టెస్టులు.. దేశ‌మంతా ఒకే రేటు ఉండాలి: సుప్రీం కోర్టు

ప్రైవేటు ఆస్ప‌త్రులు, ల్యాబ్‌ల‌లో క‌రోనా టెస్టుల‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేసే చార్జీలు దేశ‌మంతా ఒకేలా ఉండాల‌ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించింది. అలాగే క‌రోనా బారినప‌డిన పేషెంట్ల‌కు ఆస్ప‌త్రుల్లో స‌రైన చికిత్స అందేలా ప‌ర్య‌వేక్ష‌ణ‌కు నిపుణులు క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని, ఈ క‌మిటీలు త‌ర‌చూ ఆస్ప‌త్రుల‌కు నేరుగా వెళ్లి చెక్ చేయాల‌ని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు చెప్పింది. దేశ వ్యాప్తంగా ప‌లు న‌గారాల్లో క‌రోనా టీట్మెంట్, మృత‌దేహాల‌ను క్లియ‌ర్ చేసే విష‌యాల్లో ప్ర‌భుత్వాలు ఫెయిల్ అవుతున్నాయ‌న్న వార్త‌ల‌పై సుప్రీం సుమోటోగా తీసుకుని విచార‌ణ చేస్తోంది. దీనిపై శుక్ర‌వారం జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా జ‌స్టిస్ భూష‌న్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప‌లు కీల‌క సూచ‌న‌లు చేసింది. ప్రైవేటు ల్యాబ్స్‌లో క‌రోనా టెస్టులకు సంబంధించి ఒక రీజ‌న‌బుల్ రేటును ఫిక్స్ చేయాల‌ని, అది దేశ‌మంతా ఒకేలా ఉండాల‌ని కేంద్రానికి సూచించింది. పేషెంట్ కేర్ విష‌యంలో ఎక్క‌డా లోపాలు జ‌ర‌గ‌కుండా చూడాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది. దీనిపై ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌ర్ చేసేందుకు అన్ని క‌రోనా వార్డుల్లో సీసీ కెమెరాలు పెట్టాల‌ని న్యాయ‌స్థానం చెప్పింది. మృత‌దేహాల‌ను స‌రైన ప‌ద్ధ‌తిలో డిస్పోజ్ చేసేందుకు నిపుణుల క‌మిటీల సూచ‌న‌ల‌ను పాటించాల‌ని పేర్కొంది. క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారి రిపోర్టుల‌ను పేషెంట్, వారికి కుటుంబ‌స‌భ్యుల‌కు చెప్పొద్దంటూ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఆదేశాల‌ను సుప్రీం కోర్టు ఈ విచార‌ణ సంద‌ర్భంగా త‌ప్పుబ‌ట్టింది. త‌ప్ప‌నిస‌రిగా పేషెంట్స్, వారి కుటుంబ‌స‌భ్యులకు టెస్టు రిపోర్టుల‌ను అందించాల‌ని, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం త‌న ఆదేశాలను పునః స‌మీక్షించుకోవాల‌ని ఆదేశించింది.

కాగా, రోజు రోజుకీ క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల్లో ప్రైవేటు ల్యాబ్స్‌లోనూ టెస్టులు చేసేందుకు తెలంగాణ స‌హా ప‌లు రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు అనుమ‌తించాయి. అయితే ఆ ప్రైవేటు సంస్థ‌లు ఇష్టానుసారం చార్జీలు వ‌సూలు చేయ‌కుండా ఉండేందుకు రాష్ట్రంలో రూ.2200 గ‌రిష్ఠ ధ‌ర‌గా తెలంగాణ ప్ర‌భుత్వం ఫిక్స్ చేసింది. అయితే పొరుగున ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఈ ధ‌ర‌ను రూ.2900గా ప్ర‌క‌టించింది. ప్రైవేటు ల్యాబ్స్‌లో టెస్టుల‌కు సంబంధించి ఇలా ర‌క‌రకాలుగా తేడాలు ఉన్న నేప‌థ్యంలో ఇవాళ సుప్రీం కోర్టు సూచ‌న‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

Latest Updates