దిశ ఎన్‌కౌంటర్ కేసు.. పోలీసులు తప్పుచేశారని మేం అనట్లే: సుప్రీం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ విషయంలో పోలీసులు తప్పు చేశారని తాము అనడం లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్లి జస్టిస్ బోబ్డే. అయితే ఏది నిజమన్నది ఊహించుకోలేమని అన్నారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పులు జరిపారా? లేక కావాలని బూటకపు ఎన్‌కౌంటర్ చేశారా? అన్నది తెలియాలని అభిప్రాయపడ్డారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుపుతుండగా మళ్లీ వేరే ఎంక్వైరీ అవసరం లేదన్నారు. అయితే అక్కడ క్రిమినల్ కోర్టులో ఎటువంటి విచారణ చేపట్టడంలేదని, దీనిపై నిష్పాక్షిక విచారణ జరగాలని సీజేఐ అన్నారు. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆదేశిస్తున్నామని చెప్పారు. ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని, సభ్యులకు సీఆర్పీఎఫ్ జవాన్లతో రక్షణ కల్పించాలని చెప్పారు.

ఈ కమిషన్‌లో సుప్రీం మాజీ న్యాయమూర్తి సిర్పూర్కర్, బాంబే హైకోర్టు మాజీ జడ్డి రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ ఉంటారని తెలిపారు. ఆరు నెలల లోపు ఎంక్వైరీ పూర్తి చేయాలని సూచించారు. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ ఇతర కోర్టు, సంస్థ దీనిపై విచారణ జరపొద్దని ఆదేశించారు సీజేఐ జస్టిస్ బోబ్డే.

Latest Updates