సజ్జన్ కుమార్ కు బెయిల్ నిరాకరించిన సుప్రీం

న్యూఢిల్లీ: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ కు వైద్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. వైద్య నివేదికను పరిశీలించిన చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ హృశికేష్ రాయ్ ల ధర్మాసనం ప్రస్తుతం సజ్జన్ కుమార్ ను ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని చెప్పింది. వీడియో కాన్ఫరెన్సింగ్ లో విచారించిన అత్యున్నత ధర్మాసనం.. జూలై లో రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును పరిశీలిస్తామని తెలిపింది.

Latest Updates