మోడీ,షా కోడ్ ఉల్లంఘనలపై ఈసీకి సుప్రీం ఆదేశం

ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్​షాలపై ఎన్నికల కోడ్​ ఉల్లంఘనలకు సంబంధించి కాంగ్రెస్​ చేసిన ఫిర్యాదులపై 6వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్​ ఎంపీ సుస్మితా దేవ్​ దాఖలు చేసిన పిటిషన్​పై సీజేఐ జస్టిస్​ రంజన్ గొగోయ్​ నేతృత్వంలోని బెంచ్​గురువారం విచారించింది. సుస్మితా దేవ్​ తరఫున సీనియర్​ న్యాయవాది అభిషేక్​ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. తాము ఈసీకి 11 ఫిర్యాదులు చేస్తే రెండింటిపైనే నిర్ణయం తీసుకున్నారన్నారు. మే 6న కేసు విచారించే సమయానికి మిగతా వాటిపై ఈసీ నిర్ణయం తీసుకోవాలని బెంచ్​ ఆదేశించింది.

పోటీకి అనర్హునిగా ప్రకటించండి…

సిటిజెన్​ షిప్​ వివాదం తేలేవరకూ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాహుల్​ గాంధీని అనర్హునిగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఈ మేరకు కేంద్రం, ఈసీలకు ఆదేశాలు జారీ చేయాలంటూ జై భగవాన్​ గోయల్​, సీపీ త్యాగీ పిటిషన్​లో కోరారు. సిటిజెన్​షిప్ వివాదం తేలేవరకూ ఓటరు జాబితా నుంచి రాహుల్​ పేరును తొలగించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ లాయర్​ బరుణ్​ కుమార్​ సిన్హా మరో పిటిషన్​ దాఖలు చేశారు.

Latest Updates