శివాజీ విగ్రహంపై కేంద్రం,మహారాష్ట్రకు సుప్రీం నోటీసులు

ముంబై ఆరేబియా తీరంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ నిర్మాణాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ విగ్రహాన్ని రూ.3,643 కోట్ల 73 లక్షల బడ్జెట్ అంచనాతో నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించింది. 2022-23 కల్లా దీని నిర్మాణం పూర్తిచేయాలని మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ముందస్తు పనులు కూడా మొదలయ్యాయి. ఐతే…. అరేబియా తీరంలో ఈ విగ్రహ స్థాపన పర్యావరణానికి కీడు కలిగిస్తుందంటూ పర్యావరణ ప్రేమికులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీరప్రాంతంలో శివాజీ విగ్రహం, పార్క్ నిర్మాణంపై స్టే ఇవ్వాలని కోర్టును కోరారు.

ఈ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. దీనిని పరిశీలించిన న్యాయస్థానం… అనుమతులు ఇచ్చిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

2018 నవంబర్ 1న శివాజీ విగ్రహం, పార్క్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఉత్తర్వులు ఇచ్చింది. బడ్జెట్ అంచనా రూ.3,700 కోట్ల నిధుల విడుదలకు ఆమోద ముద్రవేసింది. ఐతే… గత డిసెంబర్ లో ప్రాజెక్టు అంచనాను రూ.56.70 కోట్లు తగ్గిస్తూ మరో నోటీసు విడుదలచేసింది. రూ.2581 కోట్లు ప్రాజెక్టు నిర్మాణానికి, రూ.309.72కోట్లు జీఎస్టీకి ఖర్చు

Latest Updates