అయోధ్య రాముడిదే : సుప్రీం

అయోద్య కేసులో వివాదాస్పద భూమిని హిందువులకు కేటాయించింది సుప్రీం కోర్టు. ముస్లింలకు ప్రత్యమ్నాయ స్థలం కేటాయించాలని ఆదేశించింది. స్థలం ఎక్కడ కేటాయించాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని… మూడు నెలల్లో ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయాలంది సుప్రీం.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ అయోధ్యపై తీర్పు చదివారు. బాబ్రీ మసీద్ నిర్మాణ తేదీపై ఎటువంటి స్పష్టత లేదన్నారు. రామ జన్మభూమి ఒక వ్యక్తి స్థలం కాదని అన్నారు. అయితే అయోధ్యను హిందువులు రామజన్మభూమిని  రాముడి జన్మభూమిగా గుర్తిస్తున్నారనడంలో ఎలాంటి సందేహానికీ తావులేదని చెప్పారు.

అయోధ్యలోని బాబ్రీ మసీదు నిర్మాణం ఇస్లామిక్ శైలిలో లేదని తెలిపారు. మసీదు కింద ప్రార్థనామందిరం ఉందన్న ఆనవాళ్లు ఉన్నాయన్న సీజేఐ అయితే అది రామ మందిరం అనడానికి ఆధారాలు లేవని చెప్పారు.

Latest Updates