శబరిమలకు మహిళల ఎంట్రీపై మరోసారి సుప్రీంలో విచారణ

ఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే అంశంపై గతంలో ఇచ్చిన తీర్పుపై విచారణ ప్రారంభించింది సుప్రీంకోర్టు. చీఫ్ జస్టిస్ SA బోబ్డే నేతృత్వంలోని 9 మంది జడ్జీల బెంచ్ విచారణ చేపట్టింది. ఈ బెంచ్ లో జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, L నాగేశ్వర రావు, MM శంతనగౌడర్,  SA నజీర్, RS రెడ్డి, BR గవయి, జస్టిస్ సూర్యకాంత్ లు వాదనలు విననున్నారు.

గతంలో తీర్పు ఇచ్చిన బెంచ్ లో ఉన్న జస్టిస్ చంద్రచూడ్, నారిమన్, ఖన్విల్కర్, ఇందు మల్హోత్రాలు ఈ బెంచ్ లో లేరు. తాము రివ్యూ పిటిషన్లపై విచారణ జరపడంలేదని CJI బోబ్డే స్పష్టం చేశారు. ఐదుగురు జడ్జీల బెంచ్ ఇచ్చిన తీర్పులోని 7 అంశాలపై మాత్రమే విచారణ జరుపుతున్నామన్నారు.

See Also : బీజేపీ ఆఫీస్ ను తగలబెట్టారు

Latest Updates