విమానాల్లోనూ మిడిల్ సీటు ఖాళీ

ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సొంత దేశానికి తీసుకొస్తున్న విమానాలకు సంబంధించి కీలక సూచనలు చేసింది సుప్రీంకోర్టు. విమానాల్లోనూ సోషల్ డిస్టెన్సింగ్ అవసరమని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు… జూన్ 6 నుంచి మిడిల్ సీట్ ను ఖాళీగా ఉంచాలని స్పష్టం చేసింది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో సోషల్ డిస్టెన్స్ అన్నది కామన్ సెన్స్ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఎయిర్ లైన్స్ సంస్థల సంక్షేమం కంటే ప్రజల హెల్త్ గురించి ప్రభుత్వం ఆలోచించాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుతో జూన్ 6వరకే మిడిల్ సీట్ టికెట్ల బుకింగ్ కు అనుమతించనుంది ఎయిర్ ఇండియా. వందే భారత్ మిషన్ ద్వారా ఎయిర్ ఇండియా విమానాల్లోనే విదేశాల నుంచి భారతీయులను తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికైతే అన్ని సీట్లలోనూ ప్రయాణికులను తీసుకొస్తున్నారు.

For More News..

ఇంటి నుంచి పనిచేయడానికే ఇష్టపడుతున్నరు

కూలీల తరలింపునకు 13 కోట్లు ఖర్చుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

విదేశాల్లో దూసుకుపోతున్న ఇండియన్ ఓటీటీలు

Latest Updates