అంబానీ కేసులో సుప్రీం ఆదేశాలనే మార్చేశారు

  • ఇద్దరు అసిస్టెంట్ రిజిస్ట్రార్ల నిర్వాకంపై కోర్టు సీరియస్
  • విధుల నుంచి తప్పించిన సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్

న్యూఢిల్లీ: ధిక్కరణ కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్ చైర్మన్ అనిల్ అంబానీకి అనుకూలంగా న్యాయస్థానం ఆదేశాలను మార్చి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారనే ఆరోపణలపై ఇద్దరు అసిస్టెంట్ రిజిస్ట్రార్లపై సుప్రీంకోర్టు వేటు వేసింది. ఎంక్వయిరీ అనంతరం కోర్టు మాస్టర్లు మానవ్ శర్మ, తపన్ కుమార్ చక్రవర్తిలను విధుల నుం చి తప్పిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ధిక్కరణ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311, సుప్రీంకోర్టు సెక్షన్ 11(13) కిం ద కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తన విశేషాధికారాలను ఉపయోగించి సాధారణ క్రమశిక్షణ ప్రక్రియ లేకుండా డిస్ మిస్ చేసే అధికారం సీజేఐకి ఉంటుంది.
ఆదేశాలు మార్చి.. వెబ్ సైట్ లో పెట్టి

బకాయిలు చెల్లించకపోవడంతో అనిల్‌ అంబానీ కంపెనీ ఆర్ కామ్ పై ఎరిక్సన్‌ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించిం ది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ నారిమన్‌ నేతృత్వం లోని ధర్మాసనం జనవరిలో అనిల్‌ అంబానీ, మరికొందరు రిలయన్స్‌ ప్రతినిధులకు కోర్టు ధిక్కరణ కింద షోకాజ్‌ నోటీసులు జారీ చేసిం ది. అనిల్‌ అంబానీ సహా మిగతా అందరూ వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. జస్టిస్‌ నారిమన్‌ ఇచ్చిన ఆదేశాలను జనవరి 7న సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో అప్ లోడ్‌ చేశారు. అందులో బెంచ్ ఆదేశాలకు భిన్నంగా.. ‘ధిక్కరణకు పాల్పడిన వారు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదు’ అని ఉంది. దీంతో తదుపరి విచారణకు అనిల్ అంబానీ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని చెప్పి నట్లయ్యింది. రూల్ ప్రకారం.. ధిక్కరణ నోటీసులు అందుకున్న వ్యక్తి ముందు కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలి. ఆ తదుపరి విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిం పు కోరవచ్చు. వెబ్ సై ట్ లో తప్పు ఆర్డర్ అప్ లోడ్ చేసిన విషయాన్ని సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే, ఎరిక్సన్‌ ప్రతినిధులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. షాక్ కు గురైన జస్టిస్ నారీ మన్ జనవరి 10న ‘ధిక్కరణకు పాల్పడిన వారు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిం దే’అని రివైజ్డ్ ఆర్డర్ ఇచ్చారు. దీనిని అదే రోజు వెబ్ సై ట్ లో అప్ లోడ్ చేశారు.

Latest Updates