బీఎస్-4 వెహికల్స్ కు గడుపు పెరిగింది

లాక్డౌన్, ఎకానమీ స్లోడౌన్ వల్ల బీఎస్–4 వెహికల్స్ను అమ్ముకోలేక తంటాలు పడుతున్న కంపెనీలకు, డీలర్లకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. వీటిని అమ్మకాలను, రిజిస్ట్రేషన్లను ఈ నెల 31లోపే ముగించాలనే రూల్ను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్డౌన్ విధించడంతో సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

లాక్డౌన్ ముగిసిన పది రోజుల్లోపు బీఎస్–4 వెహికిల్స్ స్టాకులో పదిశాతాన్ని అమ్ముకోవచ్చని జస్టిస్ అరుణ్ మిశ్రా నాయకత్వంలోని బెంచ్ తీర్పు చెప్పింది. అయితే ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాలకు ఈ రూల్ వర్తించదు. బీఎస్–4 వెహికల్స్ను కొన్న పది రోజుల్లోపే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ నెల 31లోపు కొన్న వాటిని మాత్రం తదనంతరం కూడా రిజిస్ట్ర్ చేయించుకోవచ్చు. బీఎస్–4 వెహికిల్స్ను అమ్మకం, రిజిస్ట్రేషన్ గడువును రెండు నెలలపాటు పొడగించాలంటూ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వచ్చే నెల నుంచి బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–6 వెహికల్స్ మాత్రమే అమ్మాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే.

అంటే బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–4 వెహికల్స్ రిజిస్ట్రేషన్లను గానీ అమ్మకాలను గానీ అనుమతించబోమని అందులో పేర్కొంది. బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–4 వెహికల్స్ కంటే బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–6 బండ్లు తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. అయితే ఇప్పటికీ షోరూముల్లో లక్షల్లో బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–4 వెహికల్స్ అమ్ముడుపోకుండా పడున్నాయి. కరోనా కేసులు పెరిగాక అయితే వీటివూపు వైపు చూసే వాళ్లే కరువయ్యారు.

డీలర్ల దగ్గరున్న  ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–4  వెహికల్స్ను అమ్మాలంటే కనీసం రెండు వారాల వర్కింగ్ డేస్ అవసరమని ఫాడా వాదించింది. బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–4 వెహికల్స్ ఇన్వెంటరీ అంతటా పేరుకుపోయింది కాబట్టి వీటి రిజిస్ట్రేషన్లకు, అమ్మకాలకు గడువును పెంచాలని సుప్రీంకోర్టును కోరింది. అయితే కోర్టు ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి పిటిషన్లను తిరస్కరించింది. మనదేశంలోనే అతిపెద్ద టూవీలర్ కంపెనీ హీరో మోటో కార్ప్ కూడా బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–4 వెహికల్స్ రిజిస్ట్రేషన్ల గడువును పొడగించాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టింది.

Latest Updates