రేపే బలపరీక్ష నిర్వహించండి..సుప్రీం ఆదేశం

మధ్యప్రదేశ్ లో ఫ్లోర్ టెస్టుకు ఆదేశించింది సుప్రీం కోర్టు. రేపు(20) ప్రత్యేక అసెంబ్లీ సమావేశపరిచి సాయంత్రం 5 లోపు బలపరీక్ష నిరూపించుకోవాలని స్పీకర్ ను ఆదేశించింది. సభ్యులంతా చేతులు పైకి లేపి ఓటింగ్ లో పాల్గొనాలని ఆదేశించింది. బలపరీక్షను వీడియో తీయాలని,అలాగే లైవ్ టెలికాస్ట్ చేయాలని ఆదేశించింది. ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేలు బలనిరూపణకు హాజరుకావాలనుకుంటే వారికి మధ్యప్రదేశ్, కర్ణాటక పోలీసులు సెక్యూరిటీ కల్పించాలని సూచించింది.

కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో సరిపడా మెజారిటీ లేదంటూ బీజేపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నెల 16న కమల్ నాథ్ ప్రభుత్వానికి బలనిరూపణ జరగాల్సి ఉండగా కరోనా వైరస్ దాటికి మార్చి 26 వరకు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు బలనిరూపణకు ఆదేశించింది.

Latest Updates