లాక్​డౌన్​ ఎఫెక్ట్.. సుప్రీంకోర్టు సమ్మర్​ వెకేషన్​ వాయిదా

న్యూఢిల్లీ: సమ్మర్​ వెకేషన్​ను సుప్రీం కోర్టు ఐదు వారాల పాటు వాయిదా వేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్​ ప్రకారం ఈ నెల 18 నుంచి జూలై 5 వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు. ఈ క్రమంలో వెకేషన్​ను రీషెడ్యూల్​ చేస్తూ సుప్రీం కోర్టు శుక్రవారం నోటిఫికేషన్​ విడుదల చేసింది. జూన్​ 19 వరకు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కేసులను విచారించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. లాక్​ డౌన్​ కారణంగా వీడియో కాన్ఫరెన్స్​ విచారణకే పరిమితమైన సుప్రీంకోర్టు ఫుల్​ బెంచ్ తాజాగా​ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీం సెలవుల వాయిదా నిర్ణయాన్ని సుప్రీం కోర్టు బార్​ అసోసియేషన్​(ఎస్సీబీఏ) స్వాగతించింది. ఈ సంక్షోభ సమయంలో పేద ప్రజలకు సాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీబీఏ ప్రెసిడెంట్​ దుషాంత్​ దేవ్​ సుప్రీం కోర్టును కోరారు.

Latest Updates