మీడియా చర్చల్లో దళిత్ పదం వాడొద్దంతే : సుప్రీంకోర్టు

మీడియా జరిపే పబ్లిక్ డిబేట్స్ లో దళిత్ అనే పదం వాడొద్దని ఇప్పటికే ఆదేశాలున్నాయి. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ.. మీడియా సంస్థలకు ఈ ఆదేశాలు గతంలోనే ఇచ్చింది. మీడియా చర్చల్లో దళిత్ అనే పదాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. మీడియాకు ఇచ్చిన మార్గనిర్దేశాలను సవాల్ చేస్తూ… కొందరు సభ్యుల బృందం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఈ పిటిషన్ పై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు ఏమాత్రం సుముఖత వ్యక్తంచేయలేదు. మీడియా బహిరంగ చర్చల్లో దళిత్ అనే పదం వాడకూడదన్న ఆదేశాలను పరోక్షంగా సమర్థించింది అత్యున్నత న్యాయస్థానం.

Latest Updates