మూలాలు తేలేదాకా విచారణ

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల మూలాలు తేలేదాకా విచారిస్తూనే ఉంటామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బుధవారం జస్టిస్​ అరుణ్ మిశ్రా, జస్టిస్​ ఆర్​ఎఫ్ నారి మన్​, జస్టిస్​ దీపక్​ గుప్తాలధర్మాసనం ఆరోపణలపై విచారించింది. సీజేఐని ఇరికించేం దుకు ‘ఫిక్సర్లు’ ‘పెద్ద కుట్ర’ చేశారంటూ సుప్రీం కోర్టు లాయర్​ ఉత్సవ్ సింగ్​ బైన్స్​ వేసిన అఫిడవిట్​ను సీరియస్​గా తీసుకుంది. సీబీఐ, ఇంటెలిజెన్స్ ​ బ్యూరో, ఢిల్లీ పోలీసు చీఫ్‌‌లను చాంబర్​కు పిలి పించిన ధర్మాసనం వివరాలు సేకరించింది. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు విచారణ మొదలు పెట్టింది. ‘‘కేసు తేలేదాకా విచారణ సాగుతూనే ఉంటుంది. ఆరోపణల వెనక మూలాలేంటో తేలేవరకు అది సాగుతూనే ఉంటుంది. ఈ న్యూసెన్స్​ను సహించేది లేదు. ఇలాంటి ఆరోపణలు చేసి సుప్రీంకోర్టును మలినం చేయాలను కుంటున్న ఫిక్సర్ల అసలు ఉద్దేశమేంటో తేలుస్తాం. వాళ్లు అలాగే చేస్తూ పోతే జడ్జిల్లో ఎవరూ మనలేరు. జడ్జిలను ఫిక్స్​ చేయొచ్చని వాళ్లు అనుకుంటున్నారా? మేమేమైనా కళ్లు మూసుకుకూర్చున్నామా? న్యాయవ్యవస్థలో  ఫిక్సింగ్​కు చోటులేనేలేదు.  ఇలాంటి వాటి వల్ల న్యాయవ్యవస్థపై జనానికి నమ్మకం పోతుంది. దీనికి సరైన ముగింపు ఇస్తాం” అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఫిక్సింగ్ జరిగినా, అబద్ధమని తేలినా ఊరుకోం
న్యాయవ్యవస్థలో ఫిక్సింగ్​ జరుగుతోందంటూ లాయర్​ బైన్స్​ ఆరోపిస్తున్నారని, ఒకవేళ ఆయన చెబుతున్నట్టు ఫిక్సర్లు అనే వాళ్లే ఉంటే దానిపై సీరియస్​గా విచారణ చేయిస్తామని ధర్మాసనం పేర్కొంది. అఫిడవిట్​లో చెప్పింది అబద్ధమని తేలినా సహించేది లేదని తేల్చి చెప్పింది. ఫిక్సర్లు అనే వాళ్లే ఉంటే వాళ్లను వదిలే ప్రసక్తే లేదని, సుప్రీం కోర్టును స్వచ్ఛంగా ఉంచడమే తమ పని అని తెలిపింది. కోర్టుకున్న పేరు చెడిపోకుండా చూస్తామని వ్యాఖ్యానించిం ది. అంతర్గత విచారణకు, బైన్స్​ వేసిన అఫిడవిట్​కు సంబంధం లేదని, దేనిదారి దాని దేనని తెలిపింది. సుప్రీం కోర్టు ఉద్యోగులపై వచ్చే తప్పుడు ఆరోపణలపై సీజేఐ గొగోయ్ చాలాకఠినంగా ఉండేవారని కొనియాడింది. చరిత్రలో ఏసీజేఐ కూడా అలాంటి చర్యలు తీసుకోలేదని జస్టిస్​ అరుణ్ మిశ్రా అన్నారు. గతంలో కొన్ని జరిగినా ఏసీజేఐ కూడా ఆరోపణలు చేసిన ఉద్యోగులను డిస్మిస్​ చేసే ధైర్యం చేయలేదని, కానీ, జస్టిస్​ గొగోయ్ మాత్రం అంతటి ధైర్యం చేశారని ప్రశంసించారు. ఆ పగతోనే రిజిస్ట్రీ అధికారులు, ఆరోపణలు చేసిన మహిళ కుమ్మక్కై తప్పుడు ఆరోపణలు చేసి ఉంటారని అన్నారు. కాబట్టి నిజాలేంటో తేల్చే వరకు విచారణ జరుగుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. ‘‘ఒకవేళ అలాంటిదేగానీ జరిగి ఉంటే, ఎవరైనా అలాంటి ఆరోపణలుచేస్తే వాటిని ‘ప్రివిలిజ్డ్​ కమ్యూని కేషన్స్​’ అనుకోవాలా స్వీకరించాలా? ఈ ప్రశ్ననే మేం డిసైడ్​ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో అటార్నీ జనరల్​ మాకుసాయపడాలి. క్రిమినల్​ ప్రకారం ఎవరు పడితే వాళ్లు ఇలాంటి మాటలు చెప్పకూడదనే నేను అనుకుంటున్నా. ఒకవేళ నేను చెప్పేదీ తప్పు కావొచ్చు. కాబట్టి, మాకు సాయపడండి ” అంటూ అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ను జస్టిస్​ అరుణ్ మిశ్రా ఆదేశించారు. దీనికి స్పందించిన ఏజీ.. ఓ వ్యక్తి ఆరోపణలు చేసినా ప్రివిలిజ్డ్​ కమ్యూని కేషన్స్​ను మాత్రం దాఖలు చేయలేనంటూ ఓ వ్యక్తి ఎలా చెబుతారో తనకు అర్థంకావడం లేదన్నా రు. దీనికి స్పందించిన ధర్మాసనం..ఈ కేసు ఇప్పుడు ఇంకా తీవ్రమైందని, కేవలం సీజేఐకాకుండా ఇతర జడ్జిలకూ మున్ముందు ఇలాంటివే ఎదురయ్యే అవకాశాలున్నాయని పేర్కొం టూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ కేసులో కొన్ని సున్నితమైన అంశాలున్నాయని,  దీన్ని చేపట్టేలా సీబీఐ నుంచి ఓ బాధ్యతగల అధికారి (డైరెక్టర్​ అయితేబాగుంటుంది)ని పిలిపిస్తారా అని ఏజీని బెంచ్ కోరింది. స్పందించిన అటార్నీ జనరల్​ వేణుగోపాల్​, సొలి సిటర్​ జనరల్​ తుషార్​ మెహతా, కోర్టు పర్యవేక్షణలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​)తోనే అంతర్గత దర్యాప్తు చేయిస్తే బాగుంటుందని సూచించారు.

Latest Updates