నాగేశ్వరరావు.. రోజంతా కోర్టులో ఓ మూలకు కూర్చో

 ఢిల్లీ : సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నాగేశ్వరరావు కోర్టును ధిక్కరించారని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ అన్నారు. నాగేశ్వరరావుకు లక్ష రూపాయల ఫైన్ విధించారు. అంతే కాదు.. రోజంతా కోర్టులో ఓ మూలన కూర్చోవాలని ఆదేశించారు. అయితే తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పారని.. పనిష్మెంట్ ఇవ్వొద్దని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానాన్ని కోరారు. కానీ అడ్వకేట్ జనరల్ ప్రతిపాదనను కోర్టు తిరస్కరించింది.

బిహార్ ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ అత్యాచారాల కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులను ట్రాన్స్ ఫర్ చేయొద్దని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ హోదాలో ఉన్న నాగేశ్వరరావు.. అధికారులకు ట్రాన్స్ ఫర్స్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో కోర్టు ధిక్కరణ ఆరోపణలను నాగేశ్వరరావు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాను బదిలీలు చేయలేదని… పదోన్నతుల మీద పంపించానన్న నాగేశ్వరరావు వాదనను కోర్టు తోసిపుచ్చింది. 

Latest Updates