సీఆర్డీఏ రద్దుపై ఏపీ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఉన్నందున ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను విచారించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. హైకోర్టులోనే మీ వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. అయితే త్వరగా నిర్ణీత సమయంలో విచారణ జరిపేలా హైకోర్టుకు అదేశాలివ్వలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. కేసు విచారణకు నిర్ణీత కాలాన్ని నిర్ధేశించలేమన్న సుప్రీంకోర్టు.. ఆ అభ్యర్థనను తిరస్కరించింది. హైకోర్టులో విచారణ త్వరగా ముగుస్తుందని అశిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. కాగా.. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై పిటిషన్లు గురువారం హైకోర్టులో విచారణకు రానున్నాయి.

For More News..

నేను కూడా ఇంజనీర్ నే.. విద్యార్థులకు మద్దతుగా సోనూసూద్

ఏపీలో ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులు రద్దు

ప్రేమించిందని నవ వధువును స్టేషన్ లో వదిలేసిన తల్లిదండ్రులు, వరుడు

Latest Updates