శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఎటూ తేల్చని సుప్రీం కోర్టు

ఢిల్లీ: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సీజే రంజన్ గోగోయ్ తీర్పును వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంటుందని సీజే అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పుపై ఎటువంటి స్టే ఇవ్వలేదు. ఐదుగురు జడ్జీల బెంచ్ ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని సీజేకు సమర్పించారు. శబరిమల తీర్పుపై జడ్జీలు ఏకాభిప్రాయానికి రాలేదు. ఐదుగురు జడ్జీల బెంచ్‌లో.. ముగ్గురు జడ్జీలు ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరగా, మరో ఇద్దరు జడ్జీలు దీన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించిన వారిలో జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్ ఉన్నారు. మెజారిటి జడ్జీల నిర్ణయానికి సమ్మతిస్తూ.. కేసును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి సీజే బదిలీ చేశారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై మరింత చర్చ జరగాలని సీజే అభిప్రాయపడ్డారు. కేవలం శబరిమల ఒక్కటే కాదని.. చాలా ఆలయాల్లోకి మహిళల ప్రవేశంపై పిటిషన్లు వచ్చాయని వాటన్నింటిపై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సీజే అన్నారు.

Latest Updates