నిర్భయ కేసు దోషి పవన్ పిటిషన్ పై నేడు విచారణ

న్యూఢిల్లీ: నిర్భయ దోషి పవన్ గుప్తా పెట్టు కున్న క్యురేటివ్ పిటిషన్ ను సోమవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ పై జస్టిస్ రమణ చాంబర్ లో విచారణ జరపనున్నట్లు జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్, జస్టిస్ ఆర్. భానుమతిల బెంచ్ పేర్కొంది. పవన్ పిటిషన్ విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ఈ నెల 3న దోషులను ఉరితీసే అవకాశంలేనట్టేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

నిర్భయ రేప్, మర్డర్ కేసులో నిందితులు నలుగురినీ ఈ నెల 3న ఉదయం ఉరితీయాలని ఢిల్లీ ట్రయల్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. దోషులకు జారీ చేసిన మూడో డెత్ వారెంట్ ఇది. అయితే, తన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా  మార్చాలంటూ పవన్ గుప్తా సుప్రీం కోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. శిక్ష అమలుకు ఒక రోజు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. ఈ పిటిషన్ పై సోమవారం ఇన్ చాంబర్ విచారణ జరుపుతామని బెంచ్ పేర్కొంది.

Latest Updates