వీవీ ప్యాట్ రివ్యూ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

వీవీ ప్యాట్  రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు పిటిషనర్లకు తెలిపింది. 50 శాతం వీవీపాట్ స్లిప్స్ లెక్కించాలని 21 పార్టీలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశాయి. 5శాతం వీవీ ప్యాట్  స్లిప్పులు లెక్కించాలని.. ఇప్పటికే ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. అయితే ఐదు శాతం కాదని, 50 శాతం లెక్కిస్తేనే కచ్చితత్వం వస్తుందని విపక్ష పార్టీలు చెప్పాయి. 50 శాతం వీవీపాట్ స్లిప్స్ లెక్కిస్తే కౌంటింగ్ కు 6 రోజుల సమయం పడుతుందని ఈసీ గత విచారణ సమయంలో సుప్రీం కోర్టుకు తెలిపింది.

వీవీపాట్లపై ఏప్రిల్ 8న తాము ఇచ్చిన తీర్పును రివ్యూ చేయబోమని సీజేఐ రంజన్ గొగొయ్ తెలిపారు. దీనిపై పిటిషన్ వేసిన 21 పార్టీల ప్రతినిధులు మాట్లాడారు. గతంలో 24 గంటల్లో బ్యాలెట్ పేపర్లు లెక్కించేవారని, ఇప్పుడు 50 శాతం వీవీపాట్లకు 6 రోజులు పడుతుందని ఈసీ చెప్పడం కరెక్ట్ కాదన్నారు చంద్రబాబు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వీవీపాట్లు ఏర్పాటు చేసి ఏం లాభమని ప్రశ్నించారు. అటు వీవీపాట్ మిషన్లు సరిగా పని చేయకుంటే దానికి బదులుగా ఏం చేయాలన్న అంశంపై కోర్టు స్పష్టత ఇవ్వలేదని అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరగాల్సిన అవసరం ఉందన్నారు ఫరూక్ అబ్దుల్లా.

Latest Updates