పంట చెత్త‌ను కాల్చ‌డంపై ఆ రాష్ట్రాల‌పై సుప్రీం సీరియ‌స్

పంట చెత్త కాల్చకుండా ఏం చర్యలు తీస్కున్నరు?
ఆరు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: వాయు కాలుష్యానికి కారణమవుతున్న పంట చెత్త కాల్చివేతను అడ్డుకోవడానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సుప్రీం కోర్టు ఆరు రాష్ట్రాలను శనివారం ప్రశ్నించింది. ఈ ఏడాది తీసుకున్న ముందస్తు చర్యల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను ఆదేశించింది. గతేడాది ఎక్కడెక్కడ పంట చెత్త తగలబెట్టారో గుర్తించి అడ్డుకోవాలని సూచించింది. ‘పంట వ్యర్థాల కాల్చివేతను ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆరు రాష్ట్రాల సీఎస్ లను జస్టిస్ అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలోని బెంచ్ ఆదేశించింది. తర్వాతి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పై గతేడాది నవంబర్ లో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates