కరోనా వైరస్ ఎఫెక్ట్ : సూరత్ వ్యాపారులకు 8వేల కోట్ల నష్టం

చైనా కరోనా వైరస్ ఎఫెక్ట్ తో భారత్ కు చెందిన పలు వ్యాపారాలు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సూరత్  బంగారం వ్యాపారంలో 8 వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

మనదేశంలో 92శాతం బంగారం వ్యాపారం సూరత్ నుంచే జరుగుతుంది. 1608లలోబ్రిటీష్ వారు బంగారం వ్యాపార స్థావరాల్ని అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. దీంతో సూరత్ బంగారానికి పెట్టింది పేరుగా నిలుస్తుంది. అంతేకాదు భారత్‌తో పాటు ఇతర దేశాలకు సూరత్ నుంచి బంగారు ఆభరణాలు ఎగుమతి అవుతుంటాయి.

అయితే హాంకాంగ్ లో మేజర్ బిజినెస్ అంతా బంగారం మీదే జరుగుతుంటుంది. ఆ బంగారం సూరత్  నుంచే ఎక్స్‌పోర్ట్ అవుతుంది. మార్చ్ నెలలో సూరత్‌కు చెందిన వ్యాపారస్థులు 8వేల కోట్లతో హాంకాంగ్‌లో జువెలరీ ఎగ్జిబీషన్ కోసం ఏర్పాట్లు చేశారు. ఆ ఎగ్జిబీషన్ క్యాన్సిల్ అయినట్లు తమకు సమాచారం అందిందని, దీంతో 8వేల కోట్ల నష్టం వాటిల్లిందని వ్యాపారులు చెబుతున్నారు.

జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజెఇపీసీ) చైర్మన్ దినేష్ నవాడియా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రూ .50 వేల కోట్ల విలువైన వజ్రాలు సూరత్ నుండి హాంకాంగ్‌కు ఎగుమతి అవుతున్నాయి. హాంకాంగ్ లో సూరత్ బంగారం బిజినెస్ 37శాతం జరుగుతుంది. ఇప్పుడు, కరోనా వైరస్ భయం కారణంగా, హాంకాంగ్  నెల రోజుల  పాటు సెలవులు ప్రకటించింది. దీంతో  హాంకాంగ్ లో ఉన్న  గుజరాతీ వ్యాపారులు ఇండియాకి తిరిగి  వస్తున్నారని ఆయన అన్నారు.

పరిస్థితి మెరుగుపడకపోతే, ఇది సూరత్ వజ్రాల పరిశ్రమపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. “సూరత్ వజ్రాల వ్యాపారం భారీగా నష్టపోవడంతో పాటు ఎగ్జిబీషన్  క్యాన్సిల్ అవ్వడంతో  సుమారు రూ .8,000 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని దినేష్ నవాడియా చెప్పారు.

కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోతే సూరత్ వజ్రాల వ్యాపారంలో నష్టాలు వేల కోట్లకు చేరుతాయని గోల్డ్ బిజినెస్ ఎనలిస్ట్, వ్యాపారి నానావతి చెప్పారు. “కరోనా వైరస్ భయం కారణంగా హాంకాంగ్‌లో అంతర్జాతీయ ప్రదర్శన నిలిపివేయబడుతుందని మాకు సమాచారం అందింది. మెగా ఈవెంట్‌లో మేము భారీ మొత్తంలో వజ్రాలను విక్రయిస్తామని”  అన్నారు.

సూరత్ నుంచి ఎగుమతి అయ్యే బంగారం ఆధారంగా హాంకాంగ్ లో ఆర్డర్లు పెరుగుతుంటాయి. దీంతో ప్రతీఏడు వేలకోట్ల బంగారాన్ని తయారు చేసి హాంకాంగ్ లో అమ్ముతుంటామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే హాంగ్ కాంగ్ విమానాశ్రయం నుంచి చైనాకు బంగారం రవాణా అవుతుంది. కరోనా వైరస్ వల్ల అన్నీరకాల ఎగుమతుల్ని నిలిపివేసినట్లు ననావతి వెల్లడించారు.

Latest Updates