నవరాత్రుల్ని వినూత్నంగా జరుకుంటున్న సూరత్ మహిళలు

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దుర్గా దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ, దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో ఆడపడుచులు ఎంతో ఉత్సాహాంగా పాల్గోంటున్నారు. మిగతా రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్ లలో కూడా ఈ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

పిల్లలు, మహిళలు ఈ వేడుకలను కొత్త బట్టలు, పిండి వంటలు, పూజలతో పండుగ జరుపుకుంటుంటే గుజరాత్ లోని సూరత్ మహిళలు మాత్రం ఈ నవరాత్రుల్ని వినూత్నంగా, ఇంకాస్త ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.

ఇటీవల దేశంలో పలు కీలకమైన పరిణామాలు, ప్రతిష్టాత్మకమైన మార్పులు జరగడంతో.. ఆ విషయాలు తెలిసేలా ఆ మహిళలంతా తమ శరీరాలపై టాటూలను వేయించుకుంటున్నారు. పండుగ సందర్భంగా ప్రత్యేక పట్టుచీరలతో తయారై తమ శరీరంపై  ‘ భూమిపై నుంచి టేకాఫ్ అయిన చంద్రయాన్ 2’ చిత్రాన్ని, ఈ మధ్యనే అమలైన ‘ట్రాఫిక్ నిబంధనలు’, అవి పాటించాల్సిన అవసరాన్ని పచ్చబొట్టు వేయించుకుంటున్నారు. మరో మహిళ జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ.. బిజెపి ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 ను రద్దు నిర్ణయాన్ని టాటూగా వేయించుకుంది. ఇలా మహిళలంతా చంద్రయాన్ -2 నుండి ఆర్టికల్ 370 వరకు పలు అంశాలపై పచ్చబొట్లు వేయించుకుంటూ..  పండుగ వేళ పలు విషయాలను తెలుపుతున్నారు.

Surat Women pose with body paint tattoos during preparations for Navratri

 

 

 

Latest Updates