సచిన్‌ ఆట కోసం క్లాస్‌లు ఎగ్గొట్టాం

న్యూఢిల్లీ: తన చిన్నతన్నంలో సచిన్‌‌ ఆటను చూసేందుకు క్లాస్‌‌లకు బంక్‌‌కొట్టే వాళ్లమని టీమిండియా బ్యాట్స్‌‌మన్ ‌‌సురేశ్‌‌రైనా అన్నాడు. 1998 సమ్మర్‌‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌‌ను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ‘కోక కోలా కప్ ‌‌ఫైనల్ ‌‌చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌ అది. మేం స్కూల్‌‌కు వెళ్లినా మా మనసంతా మ్యాచ్‌‌పైనే ఉంది. ఎలాగైనా సచిన్ ‌‌ఆట చూడాల్సిందేనని నా ఫ్రెండ్ ‌‌అమిత్‌‌తో చెబుతున్నా. ఇక ధైర్యం చేసి చివరి రెండు క్లాస్‌ ‌ఎగ్గొట్టేశాం. నేరుగా సునీల్ ‌‌అనే ఫ్రెండ్​ ఇంటికి వెళ్లాం. అక్కడైతేనే కేబుల్ ‌‌కనెక్షన్ ‌‌ఉంది. మేమందరం సచిన్‌ ‌తుఫాన్ ‌‌కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అనుకున్నట్లుగానే క్రీజులోకి వచ్చిన మాస్టర్‌‌ దుమ్మురేపాడు’ అని రైనా పేర్కొన్నాడు.

For More News..

నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి నాయకున్ని చూడలేదు

చెత్తబుట్టలో బీసీ లోన్‌‌ దరఖాస్తులు

జనం కోసమే తెలంగాణ

ఉద్యమ లక్ష్యాలకు దూరంగా..

Latest Updates