రాజ్యసభ: నామినేషన్ వేసిన కేశవరావు, సురేశ్ రెడ్డి

రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి కే కేశవరావు, సురేశ్ రెడ్డి నామినేషన్ వేశారు. కొందరు మంత్రులు, టీఆర్ఎస్ నేతల సమక్షంలో వారు అసెంబ్లీ కార్యదర్శికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఎంపీ కవిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. కేకే నామినేషన్ పై ప్రపోజర్ గా జాఫర్ హుస్సేన్ సంతకం చేశారు. అంతకుముందు కేటీఆర్ తో కలిసి గన్ పార్క్ దగ్గర నివాళి అర్పించారు కేకే, సురేశ్ రెడ్డి.

Latest Updates