దేశభక్తిని చాటుకున్న దంపతులు : బిడ్డకి మిరాజ్ పేరు

జైపూర్ :  పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మంగళవారం తెల్లవారుజామున దాడులు జరిపి ధ్వంసం చేయడంలో ..మిరాజ్ యుద్ధ విమానాలు బాగా పని చేశాయి. శక్తివంతమైన బాంబులను వేసే కెపాసిటీ వీటికి ఉంది. ఇప్పుడు అందరి నోటా ఇదే మాట వినిపిస్తుండగా..ఈ సంఘటన ఎప్పటికీ గుర్తుండేలా.. ఓ దంపతులు తమకు అదే రోజు పుట్టిన బిడ్డకి మిరాజ్ అనే పేరు పెట్టారు. రాజస్థాన్‌ లోని అజ్మీర్‌ కు చెందిన దంపతులకు ఫిబ్రవరి-26న తెల్లవారుజామున 4 గంటలకి కొడుకు పుట్టాడు. ఈ సమయంలో తమకు పండంటి మగ బిడ్డ పుట్టడంతో మిరాజ్ రాథోడ్ సింగ్ అని నామకరణం చేశామని చెప్పాడు బాలుడి తండ్రి మహావీర్‌ సింగ్. తన కుమారుడు పెద్దవాడయ్యాక సైన్యంలో చేరుతాడన్న నమ్మకం ఉన్నదని చెప్పాడు. అందుకు తాము కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. బిడ్డకు మిరాజ్ పేరు పెట్టి ఆ దంపతులు దేశభక్తిని చాటుకున్నారని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.

 

Latest Updates