సర్వయిలెన్స్ సిబ్బందికి మాస్క్ లు, గ్లోవ్స్ లేవు

  • కర్చీఫ్‌లు, స్కార్ఫ్లతోనే నెట్టు కొస్తున్న వైనం
  • కేసులు పెరగడంతో భయంభయంగా విధులకు
  •  కనీస సౌకర్యాలు సమకూర్చాలని వేడుకోలు

 

హోం క్వారంటైన్‌లో ఉన్నోళను నిత్యం చెక్‌ చేసి, వాళ ఆరోగ్యస్థి తిని చేరవేసే సర్వయిలెన్స్‌ సిబ్బంది కి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌలత్‌లు కల్పించడం లేదు. సర్కల్‌జి మాస్క్‌లు, హ్యాండ్‌ గ్లోవ్స్ కూడా సప్లయ్‌ చేయడంలేదు. దీంతో కర్చీఫ్‌లు, స్కార్ఫ్లు కట్టుకొనే సిబ్బంది డ్యూటీలు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఫారిన్‌ నుంచి వచ్చిన వాళ్లను మాత్రమే సర్వే చేసిన ఈ టీంలకు కొత్త కేసులతో చిక్కులు వచ్చిపడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ పాజిటివ్‌‌‌‌ కేసులు పెరగడంతో ఆ వైరస్‌‌‌‌ తమకు ఎక్కడ సోకుతుందో అని వాళ్లు భయపడుతున్నారు. భయం భయంగానే ఉదయం, సాయంత్రం సర్వేకు వెళ్తున్నారు.

రోజు రెండు సార్లు చెకింగ్

ఫారిన్ నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు, కరోనా పాజిటివ్‌‌‌‌ వ్యక్తులతో క్లోజ్‌ కాంటాక్ట్ ‌‌‌లో ఉన్నవాళ్ళను హ్లోం క్వారంటైన్‌లో ఉంచి రోజుకు రెండుసార్లు వాళ్ల ఆరోగ్య పరిస్థితిని చెక్‌ చేసేందుకు పీహెచ్‌సీలు, హాస్పిటళ వా రీగా స్పెషల్‌ టీంలను ఏర్పాటు చేశారు. హెల్త్‌‌‌‌ అసిస్టెం ట్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, టీఏవీపీ, నేషనల్‌ హెల్త్‌‌‌‌ మిషన్‌, రూరల్‌ హెల్త్‌‌‌‌ మిషన్‌ సిబ్బందిని ఈ టీంలలో సభ్యులుగా వేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 5,274 టీంలు తమ ప్రాంతాల్లోని హోం క్వారంటైన్‌ వ్యక్తుల వివరాలు వైద్య శాఖకు రోజు చేరవేస్తున్నాయి.

 ఎవరి నుంచి వైరస్ వస్తుందోనని భయం

వారం రోజులుగా పాజిటివ్‌‌‌‌ కేసులు పెరుగుతుండటం, వాళ్ల కాంటాక్ట్స్‌ ఎక్కువగా ఉండటంతో వారందరినీ పరీక్షించాల్సి వస్తోంది. వారిలో కొందరు ట్రేజ్‌ కాలేదు. లోకల్‌ పోలీస్‌‌‌‌, రెవెన్యూ సిబ్బందితో కలిసి వాళ్లను  ట్రేజ్‌ చేసే బాధ్యత కూడా సర్వయిలెన్స్‌ టీంపైనే ఉంది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌లో సర్వేకు వెళ్లిన వారిపై కొందరు దాడులకు తెగబడటం, సహకరించకపోవడం వీళ్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. కనీసం మాస్కులు, గ్లౌసు లు కూడా ఇవ్వకపోవడంతో కరోనా సోకిన వాళ్లనుంచి తమకు ఎక్కడ వైరస్‌‌‌‌ వస్తుందోనని వాళ్లంతా భయపడుతున్నారు. ఇదే విషయాన్ని వారు డాకర్లకు చెప్ప గా కొన్ని చోట్ల హాస్పిటళ్లో ఉపయోగించే గ్రీన్‌ క్లాత్‌తో మాస్క్‌లు కుట్టిచ్చి అందజేస్తున్నట్టుగా వైద్య సిబ్బంది చెప్తున్నారు.

ఓపీ డాక్టర్లకూ మాస్కుల్లేవు

ప్రభుత్వ హాస్పిటళ్లలో  ఔట్‌ పేషెంట్లను పరీక్షిస్తున్న డాకర్టకూ ఇంతవరకు ఎన్‌-95 మాస్క్‌లు ఇవ్వలేదు. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌ నీలోఫర్‌ ‌‌‌హాస్పిటల్‌కు చికిత్స కోసం వచ్చిన చిన్నారికి ఆ తర్వాత కరోనా పాజిటివ్‌‌‌‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఆ చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఎన్‌-95 మాస్క్‌లు ఇచ్చిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ శుక్రవారం నీలోఫర్‌‌‌‌లో డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ ఓపీ డ్యూటీ చేసే వారికి ఎన్‌-95 మాస్క్‌లు పంపింది. ఇదే పరిస్థి తి మిగతా హాస్పిటళలోనూ ్ల ఉందని, వెంటనే అన్ని హాస్పిటళ్లలో ఓపీ చూసే డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఎన్‌-95 మాస్కులు అందజేయాలని డాక్టర్లు కోరుతున్నారు.

Latest Updates