ఆ మ్యాచ్ తర్వాత కోహ్లీ మెచ్చుకున్నడు

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌–13లో సూర్యకుమార్‌‌, విరాట్‌‌ కోహ్లీ ఎపిసోడ్‌‌ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆస్ట్రేలియా టూర్‌‌కు ఎంపిక చేయకపోవడంతో నిరాశ చెందిన సూర్య.. ఆర్‌‌సీబీతో జరిగిన ఓ మ్యాచ్‌‌లో విరాట్‌‌ కోహ్లీ వైపు దీర్ఘంగా చూస్తూ కవ్విస్తాడు. దీనికి కోహ్లీ కూడా అదే స్థాయిలో చూస్తూ బ్యాట్స్‌‌మన్‌‌ వైపు వస్తాడు. కొన్ని నిమిషాల తర్వాత సూర్య పక్కకు తప్పుకోవడంతో కోహ్లీ వెళ్లిపోతాడు. సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌ అయిన ఈ మొత్తం ఎపిసోడ్‌‌ గురించి సూర్యకుమార్‌‌ స్పందించాడు. ‘ప్రతి మ్యాచ్‌‌లో కోహ్లీ చాలా ఎనర్జిటిక్‌‌గా ఉంటాడు. ఇండియా మ్యాచైనా, ఫ్రాంచైజీ మ్యాచైనా, ఏ అపోజిషన్‌‌ అయినా అలాగే కనిపిస్తాడు. ఆ రోజు మ్యాచ్‌‌ ఆర్‌‌సీబీకి చాలా ఇంపార్టెంట్‌‌ కావడంతో అలా జరిగిందేమో. మ్యాచ్‌‌ ముగిసిన తర్వాత మళ్లీ నార్మల్‌‌ అయ్యాడు. బాగా ఆడావని నన్ను ప్రశంసించాడు’ అని సూర్య పేర్కొన్నాడు.

Latest Updates