భారీ వ‌ర్షానికి జ‌ల‌మ‌య‌మైన‌ సూర్యా‌పేట జిల్లా

సూర్యాపేట జిల్లా : ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సూర్యాపేట పట్టణం జ‌ల‌మ‌య‌మైంది. ఆత్మకూర్ (ఎస్) మండలం నశింపేట వద్ద ప్రవహిస్తోన్న వాగును దాటే క్రమంలో ఓ వాహ‌నం నీటిలో కొట్టుకుపోయింది. ఆదివారం రాత్రి గొర్రెలను తరలించే వాహనంలో వ‌స్తుండ‌గా న‌శింపేట ద‌గ్గ‌ర వాగు ప్ర‌వాహం ఎక్కువ కావ‌డంతో వాహ‌నం కొట్టుకుపోయింది. వాహ‌నంలో ఉన్న‌వారు గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో స్థానికులు వ‌చ్చి వాహ‌నంలో ఉన్న‌ ముగ్గురిని కాపాడారు. భారీ వ‌ర్షానికి సూర్య‌పేట‌లోని శ్రీనివాసకాలనీ, మానస నగర్, ఇందిరమ్మ కాలనీ, శివారు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది.

Latest Updates