నా కొడుకుకు రియా విషం పెట్టి చంపింది.. సుశాంత్ తండ్రి సెల్ఫీ వీడియో

రియా చక్రవర్తి తన కొడుకైన సుశాంత్ కు విషమిచ్చి చంపిందని సుశాంత్ తండ్రి కేకే. సింగ్ గురువారం ఆరోపించారు. సుశాంత్ కేసులో రియానే హంతకురాలని.. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రియా చక్రవర్తి చాలాకాలం నుంచి నా కొడుకు సుశాంత్ కు విషం ఇస్తుంది. అది స్లో పాయిజన్ లా పనిచేసింది. సుశాంత్ కేసులో రియానే హంతకురాలు. సీబీఐ వెంటనే ఆమెను మరియు ఆమె సహచరులను అరెస్ట్ చేయాలి’ అని సుశాంత్ తండ్రి కేకే. సింగ్ ఒక వీడియోలో పేర్కొన్నాడు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి కేసుకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) రియా చక్రవర్తి మరియు ఆమె సహచరులపై కేసు నమోదు చేసిన కొన్ని రోజులకే కేకే. సింగ్ ఈ ప్రకటన చేయడం కీలకంగా మారింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద ఎన్‌సిబి ఈ కేసును నమోదు చేసింది. ఈ చట్టం ప్రకారం.. మాదకద్రవ్యాల తీసుకున్నా లేదా అందించినా కూడా నేరమే.

డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ (ఎన్‌సిబి) కేపీఎస్ మల్హోత్రా పర్యవేక్షణలో ఢిల్లీ మరియు ముంబైల నుంచి ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు బ్యూరో డైరెక్టర్ జనరల్ రాకేశ్ అస్థానా తెలిపారు. కాగా.. ఆస్పత్రి మార్చురీలోకి ప్రవేశించడానికి రియాను అనుమతించినందుకు కూపర్ హాస్పిటల్ మరియు ముంబై పోలీసులకు మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎంఎస్‌హెచ్‌ఆర్‌సి) నోటీసు పంపింది. ఆస్పత్రి మార్చురీలోకి రావడానికి రియాకు ఉన్న అనుమతులెంటో తెలపాలని నోటీసులో ప్రశ్నించింది.

బీహార్‌లో జూలై 28న రియా చక్రవర్తిపై రాజ్‌పుత్ తండ్రి కేకే. సింగ్ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన తరువాత జూలై 31 న ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ను నమోదు చేసింది. పాట్నాలో రియాపై నమోదైన ఎఫ్ఐఆర్ చట్టబద్ధమైనదని ఆగస్టు 19న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా.. సుశాంత్ మరణానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని కోరింది.

For More News..

శానిటైజర్ ఇచ్చి టెంపరేచర్ చెక్ చేసే అందమైన ‘జఫిరా’

దేశంలో ఒక్కరోజే 75,760 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్ కేసులు

కార్యకర్తలకు న్యాయం చేయలేనపోతున్నానని లోక్ సభ ఎంపీ రాజీనామా

Latest Updates