షాకింగ్ న్యూస్: బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, టెలివిజన్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆదివారం సూసైడ్ చేసుకున్నారు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ ఉరివేసుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు. లాక్​డౌన్ ఎఫెక్టుతో సుశాంత్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడని, అతని సూసైడ్ కి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. పోస్టు మార్టం రిపోర్టు రావాల్సి ఉందన్నారు. సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది.
2008లో సుశాంత్ సింగ్ స్టార్ ప్లస్ లోని ఓ సీరియల్ ద్వారా కెరీర్ ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కై పో చెయ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుశాంత్.. ఎంఎస్ ధోని బయోపిక్ తో మంచిపేరు తెచ్చుకున్నారు. శుద్ధ్ దేశీ రొమాన్స్, కేదార్​నాథ్, చిచోరె సినిమాల్లో నటించి మెప్పించారు.

Latest Updates