సుశాంత్ పేరుతో కోటీశ్వరుడయ్యాడు..ఎలా అంటే

టెక్నాలజీ అప్ డేట్ అయ్యే కొద్ది వీక్ నెస్ ను అడ్డం పెట్టుకొని యూట్యూబ్ లో లక్షలు సంపాదించేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. దివంగత  బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ మరణం తరువాత..ఆయన ఆత్మహత్య గురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ తెగ ప్రయత్నం చేశారు. దీన్ని ఆసరాగా తీసుకుకున్న బీహార్ కు చెందిన రషీద్ సిద్దిఖీ  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ఫేక్  స్టోరీల మీద స్టోరీల్ని క్రియేట్ చేశాడు. దీంతో భారీ ఎత్తున వ్యూస్ ను సంపాదించుకున్నాడు 4 నెలల్లో రూ.15 లక్షల్నిసంపాదించగా..ఒక్క సెప్టెంబర్ నెలలోనే రూ.6.5 లక్షలను సంపాదించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు అతగాడి ఫేక్ స్టోరీస్ ఎలా ఉంటాయో. రాజ్ పుత్ మరణం కంటే అతని యూ ట్యూబ్‌కు 2 లక్షల సబ్ స్కైబర్స్ ఉండగా… చనిపోయాక వారి సంఖ్య 3.70 లక్షలకు చేరింది.  రాజ్ పుత్ తో పాటు ఇతర బాలీవుడ్ హీరోలు, హీరోయిన్ల గురించి ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడంతో పోలీసులు అతడిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates