సుశాంత్ సింగ్ డెత్ మిస్ట‌రీ :15 కోట్ల‌ బ‌్యాంక్ ట్రాన్సాక్ష‌న్ల‌ పై ఈడీ అధికారుల ఆరా

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ మిస్ట‌రీ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. సుషాంత్ సింగ్ మ‌ర‌ణం వెనుక అత‌ని ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి హ‌స్తం ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. జులై 26న సుశాంత్ మ‌ర‌ణంపై ఆయ‌న తండ్రి కేకే సింగ్ రియా చ‌క్ర‌వ‌ర్తి ఆమె కుటుంబ స‌భ్యుల‌పై బీహార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.
ముంబై బాంద్రా కొటాక్ మ‌హేంద్ర బ్యాంక్ కు చెందిన సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్లు మూడు అకౌంట్ల‌కు ట్రాన్స్ ఫ‌ర్ అయ్యాయ‌ని ఆరోపించారు. ఆ బ్యాంక్ అకౌంట్లు రీయా చ‌క్ర‌వ‌ర్తి ఆమె త‌ల్లి, సోద‌రుడివేన‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో రియాపై ప‌లు సెక్ష‌న్ల కింద ఎఫ్ ఐఆర్ న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. విచార‌ణ‌లో భాగంగా ఇవాళ‌ బీహార్ పోలీసులు బాంద్రా కొటాక్ బ్యాంక్ లోని సుశాంత్ అకౌంట్ ట్రాన్సాక్ష‌న్ల‌పై ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈడీ అధికారులు సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో న‌మోదైన ఎఫ్ ఆర్ , సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల గురించి వివరాల్ని సేక‌రిస్తున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ , రియా చ‌క్ర‌వ‌ర్తిల స్టార్ట‌ప్ కంపెనీలు

సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో విచార‌ణ‌ను వేగ‌వంతం చేస్తున్నారు. సుశాంత్, రియాల భాగ‌స్వామ్యంలో మూడు స్టార్ట‌ప్ కంపెనీలను ఏర్పాటు చేశారు. కేకేసింగ్ ఫిర్యాదుతో రియాను అత‌ని సోదరుడు షోయిక్ ను ముంబై పోలీసులు చేప‌ట్టిన విచార‌ణ‌లో మూడు స్టార్ట‌ప్ కంపెనీల‌కు రియా, పోయిక్ లు డైర‌క్ట‌ర్లుగా ఉన్న‌ట్లు చెప్పారు. ముంబై ఉల్వే, పన్వెల్ ప్రాంతంలో రియా తండ్రికి చెందిన ఫ్లాట్ ల‌లో రెండు కంపెనీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు.

Latest Updates