రేపే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంత్యక్రియలు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై పొలీసుల విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా ఆదివారం ఉదయం ఆత్మహత్య అనంతరం పోలీసులు సుశాంత్  బెడ్ రూమ్ లో కొన్ని కీలక ఆధారాల్ని సేకరించారు. ఆ ఆధారాలతో విచారణ ముమ్మరం చేస్తున్నారు. అయితే సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలు వెలుగులోకి రాకున్నా…డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  పోలీసులు మరోవైపు సుశాంత్ మృతదేహాన్ని  ముంబైలోని కూపర్ ఆస్పత్రికి తరలించి , పోస్టుమార్టం నిర్వహించారు. అయితే బీహార్  పాట్నాలో ఉన్న తన తండ్రి  వచ్చిన వెంటనే రేపు అంత్యక్రియలు ముంబైలో జరుగుతున్నట్లు ఇండియా టుడే తన కథనం లో పేర్కొంది.

Latest Updates