రియా, సుశాంత్ ను ఎంత‌లా టార్చ‌ర్ పెట్టిందంటే

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్ట‌రీలో అనేక సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. సుశాంత్ సింగ్ ను మెంట‌ల్ ఆస్ప‌త్రిలో జాయిన్ చేయించేందుకు రియా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఇండియా టుడే క‌థ‌నం ప్ర‌కారం జూన్ 8 న సుశాంత్ ఫోన్ నెంబ‌ర్ ను రియా బ్లాక్ లిస్ట్ లో పెట్టిన‌ట్లు ఆధారాలు వెలుగులోకి వ‌చ్చాయి. అంతేకాదు జూన్ 8నుంచి 14 వ‌ర‌కు ఎలాంటి కాల్ రికార్డ్ లేన‌ట్లు స‌మాచారం.

నవంబర్ 2019లో కూడా సుశాంత్ ఛండీఘర్‌లో ఉన్న తనను రియా తిరిగి రావాల్సిందిగా బ్లాక్‌మెయిల్ చేస్తోందని, సాయం కోసం ఫోన్ చేసినట్లు తెలిసింది. సుశాంత్ డిసెంబర్ 2019లో మొబైల్ నంబర్ మార్చినట్టుగా జాతీయ మీడియా ఛానల్ చెప్పింది

జ‌న‌వ‌రిలో సుశాంత్ ఛండీగ‌ర్ లో ఉన్న త‌న సోద‌రి ఇంట్లు ఉన్న‌ట్లు, అలా జనవరి 20 నుంచి జనవరి 24 మధ్య 25సార్లు రియా..సుశాంత్ కు ఫోన్ చేసిన‌ట్లు కాల్ డేటాలో తేలింది.

రియా టార్చ‌ర్ త‌ట్టుకోలేక సుశాంత్ ఫోన్ నెంబ‌ర్ మార్చాడు. ఆ నెంబ‌ర్ నుంచి సుశాంత్ త‌న కుటుంబ‌స‌భ్య‌లుకు ఫోన్ చేసి రియా, ఆమె కుటుంబం తనను మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలని చూస్తున్నారని, తనకు చేరడం ఇష్టం లేదని చెప్పినట్లుగా జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. అంతేకాదు, ముంబైకి గుడ్‌బై చెప్పి హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎక్కడో ఒకచోట ఉంటానని కుటుంబ సభ్యులతో సుశాంత్ చెప్పినట్లు తెలిసింది.

Latest Updates