సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు కాలిఫోర్నియా అసెంబ్లీ గౌరవం

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సేవలను కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ గౌరవించింది. ఇండియన్ ఇండిపెండెంట్స్ డే సందర్భంగా సుశాంత్ సేవలను గౌరవిస్తూ అతడి సోదరి శ్వేతా సింగ్ కృతికి కాలిఫోర్నియా అసెంబ్లీ సర్టిఫికెట్‌ను అందించింది. హాలీవుడ్‌కు వెళ్లాలని సుశాంత్ ఎన్నోసార్లు తన కోరికను వ్యక్తం చేశాడు. కాలిఫోర్నియా అసెంబ్లీ ఇచ్చిన సర్టిఫికెట్‌ను సుశాంత్ సోదరి కృతి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

‘ఇండిపెండెంట్స్ డే సందర్భంగా కాలిఫోర్నియా నా సోదరుడు (సుశాంత్) సమాజానికి చేసిన సేవలను గుర్తించింది. కాలిఫోర్నియా మాతో ఉంది.. మరి మీరు? మీ మద్దతుకు మప్పిదాలు కాలిఫోర్నియా’ అనే క్యాప్షన్‌ను ఈ ట్వీట్‌కు జత చేసింది. ‘కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ నుంచి ఈ గౌరవాన్ని అందుకోవడాన్ని గొప్పగా భావిస్తున్నా. నా సోదరుడి తరఫున ఇండియన్ సినిమాకు, సమాజానికి అతడు అందించిన సేవలకు గుర్తింపుగా, మెచ్చుకోలుగా ఈ గౌవరం దక్కింది. ఈ ఆపత్కాలంలో నిరంతర మద్దతును అందిస్తున్న ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీతోపాటు అసెంబ్లీ మెంబర్స్‌కు నా కృతజ్ఞతలు’ అని కృతి పేర్కొన్నారు.

Latest Updates