సుశాంత్ డ్ర‌గ్స్ కోసం మ‌మ్మ‌ల్ని వాడుకున్నాడు : రియా

డ్ర‌గ్స్ కేసులో జైలు శిక్ష‌ను అనుభ‌విస్తున్న రియాచ‌క్ర‌వ‌ర్తి రెండు వారాల త‌రువాత మ‌రోసారి బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

ఈ సంద‌ర్భంగా మూడు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు విచార‌ణ చేప‌ట్టినా..విచార‌ణ‌లో ఎక్క‌డా త‌న‌ని దోషిగా నిర్ధారించేలా ఆధారాలు ల‌భ్యం కాలేద‌న్నారు. అంతేకాదు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సైతం డ్ర‌గ్స్ తీసుకొనేందుకు త‌మ‌ను ఉప‌యోగించుకున్నార‌ని బెయిల్ పిటిష‌న్ లో పేర్కొంది. ఈ బెయిల్ పిటిష‌న్ పై ఇవాళ వ‌ర్షం ప‌డుతున్న కార‌ణంగా కేసును బాంబే హైకోర్ట్ రేపు విచార‌ణ జ‌ర‌ప‌నుంది.

కాగా డ్ర‌గ్స్ స్మ‌గ‌ర్ల‌తో సంబంధాలు, సుషాంత్ రాజ్ పుత్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణంపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సెప్టెంబ‌ర్ 9న అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఎన్సీబీ అధికారులు రియా చ‌క్ర‌వ‌ర్తి డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ కుంభ‌కోణంలో కీరోల్ ప్లేచేసిన‌ట్లు వెల్ల‌డించారు.

తాజాగా రియా చ‌క్ర‌వ‌ర్తి దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్ లో సుషాంత్ సింగ్ మాత్ర‌మే డ‌గ్ర్ ను వినియోగించేవార‌ని, త‌న స్టాఫ్ తో తెప్పించుకునేవార‌ని పేర్కొంది.

సుశాంత్ జీవించి ఉంటే కొద్దిమొత్తంలోనైనా డ్ర‌గ్స్ తీసుకునేవార‌ని, ఇది సంవ‌త్స‌రం పాటు నాన్ బెయిలబుల్ నేరంగా ప‌రిగ‌ణించే అవ‌కాశం ఉంద‌ని తానుభావిస్తున్న‌ట్లు పిటిష‌న్ లో వెల్ల‌డించింది.

Latest Updates