డెలివరీ బాయ్స్ గా బాడీగార్డ్స్.. ఐడియా అదుర్స్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా చాలా దేశాల్లో పర్యాటక రంగంతోపాటు హోటల్ ఇండస్ట్రీపై తీవ్రంగా ఎఫెక్ట్ పడింది. వ్యాక్సిన్ రావడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉండటంతో ఈ రంగాలు ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదు. అయితే హోటట్స్, రెస్టారెంట్స్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందనే చెప్పాలి. కస్టమర్స్ ఫుడ్ డెలివరీ వైపు ఆసక్తి చూపిస్తుండటం శుభ సూచకంగా చెప్పొచ్చు. ఈ తరుణంలో కస్టమర్స్ ను మరింతగా ఆకట్టుకునేందుకు సెంట్రల్ జపాన్ లోని సుషి రెస్టారెంట్ కొత్తగా ఆలోచించింది.

ఫుడ్ డెలివరీ కోసం డెలివరీ బాయ్స్ కు బదులు బాడీ గార్డ్స్ ను ఎంచుకుంది. ఈ షర్ట్ లెస్ బాడీ గార్డ్స్ చేసే డెలివరీకి మ్యాచో అనే పేరు పెట్టింది. ఈ రెస్టారెంట్ ఓనర్, చెఫ్, బాడీ బిల్డర్ కూడా అయిన 41 ఏళ్ల ఇమాజుషీ మసనోరి సుగియురా డెలివరీ చేయడానికి ఫిట్ నెస్ జిమ్స్ లో తనతో పని చేసిన మిత్రులను సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఈ డెలివరీ అందరు కస్టమర్స్ కు ఉండదు. 7 వేల యాన్స్ (66 డాలర్లు) ఆర్డర్ చేసిన వారికే మ్యాచో డెలివరీని అందిస్తున్నారు. ఈ వినూత్న్ ప్రమోషన్ ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. సుగియురాకు రోజుకు 10 ఆర్డర్ల వరకు రావడం విశేషం. మరి ఈ బాడీ గార్డ్ ఫుడ్ డెలివరీ ఎలా ఉందో మీరూ చూసేయండి మరి..!

Latest Updates