2008 ముంబై దాడుల తర్వాత UPA ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది : సుష్మా

2008లో ముంబై దాడుల తర్వాత నాటి యూపీఏ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. అప్పుడే పాకిస్తాన్ పై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఉంటే మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉండకపోయేదన్నారు. కేవలం సూత్రధారులను పట్టుకుని దర్యాప్తు చేయాలని నోటిమాటగా చెప్పడాన్ని తప్పుబట్టారు. ఎన్డీఏ హయాంలో ఉరి దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఎయిర్ స్ట్రైక్స్ చేశామన్నారు సుష్మా.

Latest Updates