ముగిసిన సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు

విదేశాంగ శాఖ మాజీ మంత్రి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మాస్వరాజ్ పార్ధివదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీ .. లోధి రోడ్డులోని స్మశాన వాటికలో సుష్మాస్వరాజ్ అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. భర్త స్వరాజ్ కౌశల్ సమక్షంలో…  కూతురు బన్సూరీ  .. సుష్మాస్వరాజ్ అంతిమ సంస్కారాలను నిర్వహించారు.

వెంకయ్య భావోద్వేగం

లోథి స్మశాన వాటికలో సుష్మా స్వరాజ్ కు ప్రధాని మోడీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య, అగ్రనేత అద్వానీ, హోంశాఖ మంత్రి అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ సహా.. కేంద్రమంత్రులు చివరిసారి నివాళులు అర్పించారు. సుష్మ పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచిన వెంకయ్య.. మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు.

ఢిల్లీ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. పోలీసుల గౌరవ వందనం తర్వాత సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఎలక్ట్రిక్ క్రీమేషన్ పద్ధతిలో సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు పూర్తిచేశారు.

Latest Updates