గచ్చిబౌలి నకిలీ సీబీఐ దోపిడీ కేసులో పురోగతి

గచ్చిబౌలి నకిలీ సీబీఐ దోపిడీ కేసులో పురోగతి

గచ్చిబౌలి నానక్ రాంగూడ లో నకిలీ సీబీఐ దోపిడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులు ఉపయోగించిన కారు నంబర్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. ప్రత్యేక టీమ్ లతో దర్యాప్తు ముమ్మరం చేశారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండు రోజుల క్రితం సిబిఐ అధికారులమంటూ  ఓ ఇంటిని లూటీ చేశారు. సోదాలు పేరుతో ఇంటికి కన్నం వేశారు.  గచ్చిబౌలి నానక్ రాంగూడలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జయభేరి ఆరెంజ్ కౌంటీలోని ఓ ప్లాట్ లో సీబీఐ అధికారుల పేరుతో కొందరు దోపిడీకి పాల్పడ్డారు. లాకర్ లో ఉన్న కేజీ 35 తులాల బంగారం తో పాటు లక్ష 70వేల  నగదు ఎత్తుకెళ్లారు. ఆరెంజ్ కౌంటీ లో ఉంటున్న భాగ్యలక్ష్మి అనే మహిళ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యాహ్నం రెండు గంటల సమయం లో భాగ్యలక్ష్మి ఇంటికి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. సీబీఐ అధికారులమంటూ ఇంటి ఓనర్ భాగ్యలక్ష్మి ని పరిచయం చేసుకున్నారు. దాదాపు గంటన్నర వరకు ఇంట్లోనే ఉన్నారు. లాకర్ కీస్ తీసుకుని అందులో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. తర్వాత అసలు విషయం తెలిసి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.