సీబీఎస్ఈ 10, 12 క్లాస్ ఎగ్జామ్స్ రద్దుపై సస్పెన్స్ 

రేపు సాయంత్రంలోగా నిర్ణయం తీసుకుంటామన్న బోర్డు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ క్లాస్ టెన్త్​, ట్వల్త్​ ఎగ్జామ్స్ ఉంటాయా ? లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని పరీక్షలు జరిపిన సీబీఎస్ఈ పెండింగ్ ఎగ్జామ్స్ ను పెట్టాలా ? వద్దా అనేది గురువారం సాయంత్రం లోగా నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయాన్ని సీబీఎస్ఈ బోర్డు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా కారణంగా ట్వల్త్​ఎగ్జామ్స్ రద్దు చెయ్యాలని, ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు వేయాలని స్టూడెంట్స్ పేరెంట్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఎగ్జామ్స్ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారని సీబీఎస్ఈ బోర్డును ప్రశ్నించింది.

గురువారం సాయంత్రంలోగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని సీబీఎస్ఈ బోర్డు కోర్టుకు తెలిపింది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని 250 స్కూళ్లలో క్లాస్ 10, 12 పరీక్షల్ని రద్దు చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లేదా ఇంటర్నల్ అసెస్‌‌‌‌మెంట్ ద్వారా సీబీఎస్ఈ మార్కులు వేసిందని స్టూడెంట్స్ తల్లిదండ్రులు గుర్తు చేశారు. పెండింగ్ ఎగ్జామ్స్ కు మార్కులు వేయాలని పేరెంట్స్ కోరుతున్నారు. గురువారం సాయంత్రం వరకు సమయం ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ కోరటంతో సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 25 కు వాయిదా వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates