పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి.. ఖలేజా ఉన్నోళ్లకే!

అమెరికాలో పొడవైన పాదచారుల సస్పెన్షన్​ బ్రిడ్జి ఇది. టెన్నెసీలోని గాట్లిన్​బర్గ్​లో కడుతున్నారు. ‘స్కై బ్రిడ్జ్​’ అని పిలుస్తున్నారు. గ్రేట్​ స్మోకీ మౌంటెయిన్స్​ను కలుపుతూ 680 అడుగుల పొడవుతో 140 అడుగుల ఎత్తులో కట్టారు. మే 17న ఓపెన్​ చేయనున్నారు. మీకు ఎత్తులంటే భయమైతే బ్రిడ్జి మీదకు వెళ్లకపోవడమే మంచిదంటున్నారు కట్టినోళ్లు. ఎందుకంటే.. మధ్యలోకి వెళ్లాక కింద అంతా కనిపించేలా గ్లాస్​ ఫ్లోర్​ను ఏర్పాటు చేశారు. ధైర్యమున్నోళ్లకు మాత్రమేనంటున్నారు దానిని కట్టినోళ్లు. స్కైలిఫ్ట్​ పార్క్​లో భాగంగా ఈ బ్రిడ్జిని నిర్మించారు. చైర్​లిఫ్ట్​లో క్రాకెట్​ మౌంటెయిన్​పైకి తీసుకెళతారు. అక్కడి నుంచి బ్రిడ్జిపైకి వెళ్లొచ్చు. పెద్దలైతే సుమారు ₹1000 (15 డాలర్లు) , పిల్లలైతే సుమారు ₹830 (12 డాలర్లు)  పెట్టి టికెట్లు కొనుక్కోవాలి. ప్రపంచంలోనే పొడవైన పాదచారుల సస్పెన్షన్​ బ్రిడ్జి స్విట్జర్లాండ్​లో ఉంది. దాని పేరు చార్లీ కువోనెన్​ సస్పెన్షన్​ బ్రిడ్జ్​. 279 అడుగుల ఎత్తులో 1621 అడుగుల పొడవున కట్టారు దాన్ని. 2017లో ఓపెన్​ అయింది.

Latest Updates