ఉమర్ అక్మల్ పై సస్పెన్షన్ కుదింపు

కరాచీ: పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ ఉమర్‌ అక్మల్‌ పై విధించిన మూడేళ్ల బ్యాన్‌ను బుధవారం 18 నెలలకు కుదించారు. అయితే ఉమర్‌ మాత్రంఅసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాన్‌ పూర్తిగా ఎత్తేసేదాకా పోరాడతానని చెప్పాడు. ‘ నేను చేసిన తప్పును నాకంటే ముందు చాలామంది క్రికెటర్లు చేశారు. కానీ వారెవరికీ ఇంత శిక్ష వేయలేదు. ఇప్పుడు శిక్షా కాలాన్ని తగ్గించారు. కానీ మరోసారి అప్పీలు చేస్తా. సస్పె న్షన్‌ ఎత్తేసేదాకా పోరాడతా’ అని ఉమర్‌ అన్నాడు.

పాకిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (పీఎస్‌ ఎల్‌ ) సందర్భంగా పలువురు ఫిక్సర్ లు తనను కలిసిన విషయాన్ని ఉమర్‌ దాచిపెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన పాక్‌‌‌‌ బోర్డు ఉమర్‌ పై మూడేళ్లు బ్యాన్‌ విధిస్తున్నట్లు మార్చి17న ప్రకటించింది. దీనిపై ఉమర్‌ అక్మల్‌ అప్పీలు చేసుకోగా ఇండిపెండెంట్‌ జడ్జి ఫఖిర్‌ మహ్మద్‌ ఖోఖర్‌ విచారించారు. అక్మల్‌ తప్పు చేసినప్పటి కీ అతని మీద జాలితో శిక్షను 18 నెలలకు తగ్గిస్తు న్నామని ఖోఖర్‌ పేర్కొన్నారు. దీని ప్రకారం వచ్చే ఏడాది ఆగస్టులోఉమర్‌ పై ఉన్న నిషేధం ముగుస్తుంది.

Latest Updates