బ్యాగు కలకలం : 3 గంటలు ట్రాఫిక్ జామ్

జమ్మూ: నేషనల్ హైవేపై ఓ బ్యాగు కలకలం సృష్టించింది. జమ్ము-శ్రీనగర్ రోడ్డుపై మద్యం బాటిల్స్ తో ఉన్న బ్యాగును చూసి బాంబు అనున్న వాహనదారులు పరుగులు తీశారు. ఈ సంఘటన రాంబన్‌ జిల్లాలోని ఛలీస్‌ బెల్ట్‌ పరిధిలో జరిగింది. మద్యం బాటిళ్లతో ఉన్న బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు ఆర్మీ, పోలీసులకు సమాచారమందించారు.

రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. వాహన రాకపోకలను నిలిపేశారు. బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అనుమానంతో వాహనాల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం మూడు గంటల తర్వాత పోలీసులు ట్రాఫిక్‌ ను క్లియర్‌ చేశారు. బ్యాగులో బాంబు లేదని తెలియడంతో వాహనదారులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

Latest Updates